Advertisementt

ఎస్.. నేను ‘తోపు’నే అంటున్న రామ్ గోపాల్ వర్మ!

Thu 28th May 2020 11:02 AM
coronavirus trailer,ram gopal varma,agasthya manju,be the real man challenge,tollywood  ఎస్.. నేను ‘తోపు’నే అంటున్న రామ్ గోపాల్ వర్మ!
News About Director Ramgopal Varma! ఎస్.. నేను ‘తోపు’నే అంటున్న రామ్ గోపాల్ వర్మ!
Advertisement
Ads by CJ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తాను ‘తోపు’నే అని నిరూపించుకున్నాడు.!. తాను తోపునే అని చెప్పుకుంటూనే టాలీవుడ్ ఇండస్ట్రీపైనే సెటైర్లేయడం మొదలెట్టారు. అదెలాగంటే.. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం జరిగింది. ఈ తరుణంలో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. సెలబ్రిటీలు మాత్రం ‘బీ ద రియల్‌మెన్’ అంటూ చాలెంజ్‌లు షురూ చేశారు. ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో మొదలైన ఈ చాలెంజ్‌ దర్శకధీరుడు జక్కన్న, చిరంజీవి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, కొరటాల శివ, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్, ఎంఎం కీరవాణి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు.

అయితే.. ఆర్జీవీ మాత్రం ఇలాంటి చాలెంజ్‌ల జోలికి అస్సలు వెళ్లలేదు. ఈయన్ను ఎవరూ నామినేట్ చేయలేదు కూడా. తాజాగా చాలెంజ్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘సినిమా ప‌రిశ్రమ‌కు చెందిన మిగ‌తా వారంతా ఇళ్లు తుడ‌వ‌డం, వంట చేయ‌డం, బ‌ట్టలు ఉత‌క‌డం.. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో చేసే పనిలో బిజీబిజీగా ఉంటే.. నేను మాత్రం ఓ సినిమా తెర‌కెక్కించేశాను’ అని ఆర్జీవీ గర్వంగా చెప్పుకున్నాడు. అంతేకాదండోయ్ ఇదీ నా సత్తా అంటే అని కండ‌లు చూపిస్తున్న ఎమోజీల‌ను పోస్ట్ చేశాడు. అంటే నేను ‘తోపు’నే అని ఇండైరెక్ట్‌గా ఇండస్ట్రీకి పంచ్ ఇచ్చారన్న మాట.

మొత్తానికి చూస్తే.. ప్రపంచం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతుంటే వ‌ర్మ మాత్రం ఆ మహమ్మారిపైనే వరల్డ్‌లో ఫస్ట్ టైమ్ దానిపైనే సినిమా తీసి అందరూ  అవాక్కయ్యేలా చేశారు. ఇటీవలే ‘కరోనా వైరస్’ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ అందర్నీ చాలా ఆకట్టుకుంటోంది. వాస్తవానికి ఆ వివాదాస్పదం అనే జోలికి పోకపోతే ఆర్జీవీ ఎప్పటికీ ఇండస్ట్రీ తోపే అని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆర్జీవీ మాత్రం రోజులో మూడు వివాదాలు.. ఆరు తిట్లు లేకపోతే అస్సలు నిద్రపోడు.. నిద్ర లేవడు కూడా. సో.. మరోసారి ఆర్జీవీ తన సత్తా ఏంటో చూపించాడన్న మాట.

News About Director Ramgopal Varma!:

News About Director Ramgopal Varma!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ