తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి స్థానం ప్రత్యేకం. అప్పటి వరకూ ఎవరూ ఊహించడానికి కూడా సాహసించని సమయంలో దర్శకధీరుడు కలలు కన్న స్వప్నం బాహుబలి రూపంలో ప్రపంచ ముందుకు తీసుకువచ్చాడు. భారతదేశ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికంతటా పాకేలా చేసింది. రాజమౌళి మదిలో మెదిలిన దృశ్యకావ్యం భారతీయ చలన చిత్ర చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది.
బాహుబలి ఇప్పటివరకూ ఎన్నో ఘనతలు సాధించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైంది. అక్కడ ప్రదర్శితమైన మొట్టమొదటి నాన్ ఇంగ్లీష్ చిత్రంగా రికార్డుకెక్కింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డుని క్రియేట్ చేసింది. రష్యా టెలివిజన్ లో ప్రదర్శితమైన మొదటి తెలుగు సినిమాగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. రష్యన్ వాయిస్ ఓవర్ తో రష్యాలో ప్రదర్శించబడ్డ భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.
ఈ విషయాన్ని రష్యా ఇన్ ఇండియా వారు అధికారికంగా తెలియజేశారు. జక్కన్న తెరకెక్కించిన మాహాద్భుతం ప్రపంచ జనాలని అలరిస్తుందంటే అంతకంటే గొప్పేం ఉంటుంది.