ఎంతోమంది సీనియర్ నటీనటులతో నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. సీనియర్ నటి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలు అయిన ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నుంచి సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వరకు మళ్ళీ ఈ తరం హీరోలైన టాప్ స్టార్స్ వరకు అమ్మగా, అమ్మమ్మగా, బామ్మగా అనేక చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల మన్ననలు పొందిన అన్నపూర్ణమ్మ టైటిల్ రోల్ లో మాస్టర్ రవితేజ మనవడిగా, ఆనాటి అందాలనటి శ్రీమతి జమున మరోపాత్రలో అర్చన, బాలాదిత్య హీరో, హీరోయిన్స్‌గా ఇంకా చాలా మంది ప్రసిద్ధ నటులతో భారీగా నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’.
తెలంగాణ రాష్ట్రంలో, ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ స్థాపించి అత్యధిక విజయాన్ని సాధించి అందరి మన్ననలు పొందిన ఎమ్ఎన్ఆర్ చౌదరి సినీరంగ ప్రవేశం చేసి ఆయన మిత్రుడు ప్రముఖ దర్శకుడు నర్రా శివనాగేశ్వరరావు చెప్పిన ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ కథ నచ్చడంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. మంచి ఉమ్మడి కుటుబంలాంటి ఫ్యామిలీ చిత్రాన్ని తీసి ప్రముఖ దర్శకులైన కె.విశ్వనాధ్ గారి ప్రశంసలు పొందారు. అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. సినిమా థియేటర్లు రీ ఓపెన్ అయిన తర్వాత ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం అందరికీ రీచ్ అయ్యేవిధంగా ప్రమోటింగ్‌లో చిత్ర యూనిట్ ఘనవిజయం సాధించింది.
మళ్లీ ఎమ్ఎన్ఆర్ చౌదరి తదుపరి చిత్రంగా మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రలో నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలోనే మరో భారీ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ చిత్రానికి ‘సుగ్రీవ’ అనే టైటిల్ పెట్టినట్లుగా సమాచారం. మరో విశేషం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి ‘సుగ్రీవ’ అనే టైటిల్ చాలా బాగుంది అని ఫోన్ చేసి కోటి గారిని అభినందించడం మీడియాలో బాగా వైరల్ అయ్యింది. త్వరలో రాబోతోన్న అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు.