Advertisementt

ఇండస్ట్రీకి మెగా బ్రదర్స్ ఏమైనా కింగ్‌లా!?

Tue 02nd Jun 2020 02:07 PM
director,shocking comments,mega brothers,director vijay chowdary,balayya vs nagababu,tollywood  ఇండస్ట్రీకి మెగా బ్రదర్స్ ఏమైనా కింగ్‌లా!?
Director Shocking Comments on Mega Brothers ఇండస్ట్రీకి మెగా బ్రదర్స్ ఏమైనా కింగ్‌లా!?
Advertisement
Ads by CJ

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాద్యుడు ఎన్టీఆర్ జయంతి రోజున.. నందమూరి బాలయ్య చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో, రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అయితే దీనిపై తాజాగా లెజెండరీ రచయిత త్రిపురనేని మహారథి మనవడు, త్రిపురనేని చిట్టి తనయుడు, దర్శకుడు విజయ్ చౌదరి తాజాగా స్పందించాడు. ఓ వీడియో రూపంలో స్పందించిన ఆయన.. మెగా బ్రదర్స్, ఫ్యామిలీపై తీవ్ర దుమారం వ్యాఖ్యలు చేశాడు. నాగబాబూ.. నువ్వెంత నీ బతుకెంత.. నువ్వా మా బాలయ్య గురించి మాట్లాడేది. కోన్‌కిస్కా గొట్టంగాడివి. ఇండస్ట్రీలో సంపూర్ణేష్ బాబు అంత పెద్ద నటుడివి నువ్వు. ఇండస్ట్రీలో కారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరిని లైన్లో నిలబెడితే వెనక నుంచి ముందు వచ్చేది నువ్వే. నువ్వా మా బాలయ్య గురించి మాట్లాడేది. నువ్వు కానీ చిరంజీవి తమ్ముడివి కాకపోతే నీ బతుకేంటి..? పవన్ కళ్యాణ్ అన్నవి కాకపోతే నిన్నెవడు పట్టించుకుంటాడు..? నువ్వో కోన్‌కిస్కా గొట్టంగాడివి..?. మీ అన్న చిరంజీవి కూడా హీరో మాత్రమే.. కింగ్ కాదు.. ఇండస్ట్రీ ఏం మీ ఫ్యామిలీ సొత్తు కాదు..? బాలయ్యను మీటింగులకు పిలవాల్సిన భాద్యత మీది కాదా? అని తీవ్ర దుమారం రేపే పదజాలంతో మాట్లాడాడు.

మెగా బ్రదర్స్ కింగ్‌లా..!?

అంతటితో ఆగని ఆయన.. నువ్వేమన్నా కింగా..? మీ అన్నేమైనా కింగా..? లేదంటే మీ తమ్ముడేమైనా కింగా..? బొంగేం కాదు. మీ కాపు వర్గంలో మరో స్టార్ హీరో ఎందుకు రాలేదు..? మీరు రానివ్వలేదు..? తొక్కేసారు.. మీరొక్కరే ఉండాలని తొక్కేసారు. మీరు పెట్టిన పీఆర్పీ పార్టీకి ఫండ్స్ ఇచ్చిన మీ వర్గం నాయకులతో పాటు ఎంతమంది నాశనం అయిపోయారు. అలాంటి మీరా బాలయ్య గురించి మాట్లాడేది. నీ ఇష్టమొచ్చినట్లు ఇక్కడ కూడా నోరు పారేసుకుంటామంటే ఎవ్వడూ చూస్తూ ఊరుకోడు.. కంట్రోల్‌లో పెట్టుకుని మాట్లాడు అని నాగబాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ విజయ్ చౌదరి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యవహారం మెగా బ్రదర్ దాకా వెళ్లిందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ తిట్టిపోసుకుంటున్నారు.

Director Shocking Comments on Mega Brothers:

Director Shocking Comments on Mega Brothers  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ