ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా, టెలివిజన్ షూటింగ్‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వడంతో పాటు షూటింగ్‌లకు ఉచితంగా లోకేషన్స్ ఇస్తున్నందుకు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టిటిపిసి) హైదరాబాద్ మన స్టూడియోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, APFDC చైర్మన్ విజయ్ చందర్ కి, APFDC ఎండీ విజయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యాదములు తెలియజేసింది.
తెలుగు టెలివిజన్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రసాద్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పరిశ్రమ ఉన్నా, కనీసం రెండు షెడ్యూల్స్ ఏపీలో అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ చేస్తున్నాము అన్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతులు కాస్త కష్టంగా ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చాక, విజయ్ చందర్ గారి సహకారంతో, మా టీవీ ఇండస్ట్రీ కి ఉపయోగపడే జీవొ ను ఇచ్చారని తెలిపారు. అన్నీ ప్రభుత్వ ప్రదేశాలలో ఉచితంగా చిత్రీకరణ చేసుకునే అవకాశం ఇవ్వడం తో పాటు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తూ జీవో ఇచ్చిన జగన్ గారికి మా కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
నిర్మాత డివై చౌదరి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం కు ధన్యవాదాలు. తెలంగాణా ప్రభుత్వం కూడా ఉచితంగా లోకేషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కౌన్సిల్ అధ్యక్షుడు ప్రసాద రావు, మరియు Dy.చౌదరి, S.సర్వేశ్వర రెడ్డి, యాట సత్యనారాయణ, గుత్త వేంకటేశ్వర రావు, అశోక్ నలజాల మరియు టీవీ ఫేటర్నిటి రాందాస్ నాయుడు పాల్గొన్నారు.