ప్రస్తుతం రకుల్ కాస్త డల్ గాను, సాయి పల్లవి కెరీర్ భీభత్సంగా సాగిపోతున్నాయి. రకుల్ ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటిస్తే.. సాయి పల్లవి మాత్రం లిప్ లాక్ లు, హాట్ డ్రెస్సులు వెయ్యనని స్టార్ హీరోలని పక్కనబెట్టేసింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిలో అలివేలుగా ఎవరు చేయబోతున్నారో అనే సస్పెన్స్ తెర మీదకొచ్చింది. సీత ప్లాప్ తర్వాత దర్శకుడు తేజ గోపీచంద్ తో ఓ మూవీ, రానా తో మరో మూవీ చెయ్యబోతున్నాడు. అయితే ముందు రానా మూవీనే పట్టాలెక్కాల్సి ఉండగా... రానా తాజాగా పెళ్లి పనుల బిజీలో ఉన్నాడు కాబట్టి తేజ ముందు గోపీచంద్ సినిమానే పట్టాలెక్కించబోతున్నాడట. ఇప్పటికే తేజ - గోపీచంద్ మూవీకి అలివేలు వెంకటరమణ అంటూ టైటిల్ కూడా పెట్టేసారు. అదిగో అప్పటినుండి గోపీచంద్ అలివేలుపై రకరకాల న్యూస్ లు తెర మీదకొచ్చాయి.
అందులో కాజల్, అనుష్క లు ఉంటే.. కాజల్ ని వెంటవెంటనే రిపీట్ చెయ్యడం ఎందుకులే అని.. తేజ అనుష్కని అనుకున్నాడని అన్నారు. కాని అనుష్కని తేజ అనుకోలేదని.. తేజ రకుల్ ప్రీత్ కానీ, సాయి పల్లవి కానీ అలివేలుగా అయితే బావుంటుంది అని అనుకుంటున్నాడట. ప్రస్తుతం రకుల్ అవకాశాలు లేక గోపీచంద్ తో సినిమా చెయ్యడం పక్కా. కాకపోతే సాయి పల్లవి మాత్రం డౌట్,. ఎందుకంటే విరాట పర్వం ఇంకా వేరే కమిట్మెంట్స్ తో సాయి పల్లవి అలివేలు పాత్రని రిజెక్ట్ చేస్తుంది. మరి తేజ ఫైనల్ గా రకుల్ నే గోపీచంద్ అలివేలుగా ఫైనల్ చేసినా చెయ్యొచ్చు అనే టాక్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.