Advertisementt

విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క...

Thu 04th Jun 2020 03:52 AM
venu udugula,priyamani,comrade bharatakka,rana daggubati,virataparvam,sai pallavi  విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క...
Priyamani look from VirataPravam.. విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క...
Advertisement
Ads by CJ

నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల రానా దగ్గుబాటి హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, తెలంగాణలోని నక్సలైట్ల కథాంశంతో రూపొందిస్తున్నారు. మొన్నటికి మొన్న సాయిపల్లవి లుక్ ని రివీల్ చేసిన చిత్ర బృందం తాజాగా మరో అప్డేట్ తో బయటకి వచ్చింది. ఈ చిత్రంలో జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న హీరోయిన్ ప్రియమణి నటిస్తుందన్న విషయం తెలిసిందే. 

నేడు ఆమె పుట్టినరోజుని పురస్కరించుకుని పియమణి లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి లుక్ చాలా ప్రెష్ గా ఉంది. మహా సంక్షోభం కూడా శాంతికి దారి తీస్తుందన్న నమ్మకంతో ఉండే క్యారెక్టరేజేషన్ లో ప్రియమణి పాత్ర, ఫ్రెంచ్ విప్లవంలో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో సినిమాకి అంత కీలకంగా ఉండనుందట. సురేష్ ప్రొడక్షన్, శ్రీ  లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Priyamani look from VirataPravam..:

Priyamani as Comrade Bharatakka in Virata Parvam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ