Advertisementt

పూజా హెగ్డేకి నచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా?

Fri 05th Jun 2020 12:09 PM
pooja hegde,crazy fan,cricketer,rahul dravid,heroine pooja hegde  పూజా హెగ్డేకి నచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా?
Pooja Hegde says she likes Rahul Dravid a lot పూజా హెగ్డేకి నచ్చిన క్రికెటర్ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

టాప్ హీరోయిన్స్‌లో చాలామందికి క్రికెటర్స్ అంటే పిచ్చ అభిమానం ఉంటుంది. అనుష్క శర్మ లాంటి బాలీవుడ్ హీరోయిన్ అయితే విరాట్ కోహ్లీ లాంటి టాప్ క్రికెటర్ ని పెళ్లి కూడా చేసుకుంది. అదే కొంతమంది హీరోయిన్స్ తమ అభిమాన క్రికెటర్స్ ని పొగుడుతూ ఆనందిస్తారు. తాజాగా ఓ టాప్ హీరోయిన్ ద్రావిడ్ ని తెగ పొగిడేస్తోంది. ద్రావిడ్ ఫామ్ లో లేకపోయినా... ఒకప్పుడు ఆయన ఆట తీరు ముందు ఎవరైనా దిగదుడుపే అంటుంది. అసలు ఈ తరంలో ఎంతమంది గొప్ప క్రికెట్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ద్రావిడ్ కి సాటిరారు ఎవ్వరూ అంటుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. మీ అభిమాన క్రికెటర్ ఎవరు అంటే.. పూజా హెగ్డే టకాటకా ద్రావిడ్ పేరు చెప్పి, అతని మీద తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంది.

నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ...మ్యాచ్ జరుగుతుంటే.. కనీసం స్కోర్ అయినా తెలుసుకుంటాను. క్రికెటర్స్ లో ద్రావిడ్ అంటే చాలా ఇష్టం. ఈతరం క్రికెటర్స్ లో ధోని, కె ఎల్ రాహుల్ ని ఇష్టపడతా. ఈ తరంలో ఎంతమంది క్రికెటర్స్ ఉన్నప్పటికీ... ద్రావిడ్ కూల్, క్లాసికల్ ఆట ముందు ఎవరు సరితూగలేరు. మరి ఎంత సెలెబ్రిటీ అయినా క్రికెట్ లాంటి ఆటలను చాలామంది లైక్ చేస్తారు. అలాగే పూజా కూడా ద్రావిడ్‌ని, ఆయన స్టయిల్ ని ఇష్టపడిందన్నమాట.

Pooja Hegde says she likes Rahul Dravid a lot:

Pooja Hegde Crazy fan for Cricketer Rahul Dravid

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ