Advertisementt

ఆసక్తికరంగా ఉన్న ‘A’ మూవీ టీజర్!

Fri 05th Jun 2020 05:20 PM
a,ad infinitum,nithin prasanna,preethi asrani,ugandhar muni,a movie teaser  ఆసక్తికరంగా ఉన్న ‘A’ మూవీ టీజర్!
A (AD INFINITUM) Movie Teaser released ఆసక్తికరంగా ఉన్న ‘A’ మూవీ టీజర్!
Advertisement
Ads by CJ

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు‌కి ఏకలవ్య శిష్యుడైన యుగంధర్ ముని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “A”(AD INFINITUM). నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో ‘మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్’ చిత్రాలలో పక్కింటి అమ్మాయిగా నటించిన ప్రీతి అశ్రాని హీరోయిన్. టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లతో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

మిస్సింగ్ మిస్టరీతో థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి కథ, కథాంశాలతో తెరకెక్కినట్లుగా టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. తల్లిదండ్రులతో హాయిగా ఆడుకుంటున్న పాప మిస్సవడం, ఆ తర్వాత థ్రిల్లర్ అంశాలతో టీజర్‌ను కట్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను కలుగజేస్తున్నాయి. యుగంధర్ ముని మేకింగ్ స్టైల్ చూస్తుంటే మరో మంచి దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడనిపిస్తుంది. ఓవరాల్‌గా టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసేలా ఉంది. త్వరలో సినిమా విడుదలకు సంబంధించిన విషయాలను చిత్రయూనిట్ తెలియజేయనుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె బంగారి(ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైనర్: బినిల్ అమక్కాడు(ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్: సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్), ఎడిటింగ్: ఆనంద్ పవన్ అండ్ మణికందన్ (ఎఫ్‌టిఐఐ), సంగీతం: విజయ్ కురాకుల.

Click Here for Teaser 

A (AD INFINITUM) Movie Teaser released:

A (AD INFINITUM) Movie Teaser Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ