Advertisementt

విజయ్ సినిమా ఆపాలంటూ ముఖ్యమంత్రికి లేఖ..!

Fri 05th Jun 2020 01:17 PM
vijay,kollywood,lokesh kanagaraj,covid19  విజయ్ సినిమా ఆపాలంటూ ముఖ్యమంత్రికి లేఖ..!
A letter to Tamilnadu CM for stopping movie.. విజయ్ సినిమా ఆపాలంటూ ముఖ్యమంత్రికి లేఖ..!
Advertisement
Ads by CJ

కొలీవుడ్ హీరో విజయ్ కి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. విజయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల సందడి మరో లెవెల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం విజయ్ హీరోగా చేస్తున్న మాస్టర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే లాక్డౌన్ ముగిసి, థియేటర్లకి అనుమతి లభిస్తే తమిళనాట రిలీజ్ అయ్యే మొదటి చిత్రం విజయ్ మాస్టర్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

దాంతో మాస్టర్ సినిమా రిలీజ్ ని ఎలాగైనా ఆపాలని ప్రముఖ దర్శకుడు కేయార్ ముఖ్యమంత్రికి లేఖ రాసాడని సమాచారం. విజయ్ లాంటి పాపులర్ హీరో సినిమా రిలీజైతే థియేటర్లకి జనాలు పెద్ద సంఖ్యలో వస్తారు. అసలే కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అదీగాక తమిళనాడులో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. దాంతో థియేటర్లకి అనుమతి లభించి విజయ్ సినిమా విడుదలైతే అప్పుడు పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని భావిస్తున్నారు.

దాంతో మాస్టర్ సినిమా విడుదలని ఆపాలని ముఖ్యమంత్రికి లేఖ రాసాడట. మరి ఈ విషయమై తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

A letter to Tamilnadu CM for stopping movie..:

A letter to Tamilnadu CM for stopping movie..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ