ఇప్పుడు టాలీవుడ్ మొత్తం రేడియేషన్ అనే పదం చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే కన్నడ టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిస్తే అనే ఊహే అందరిని ఓ చోట నిలవనియ్యడం లేదు. నిన్నమొన్నటివరకు ఊహాగానాలనుకున్న మేటర్ కాస్తా ఎన్టీఆర్ పుట్టిన రోజున కన్ఫర్మ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ పక్కా అని. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్, దానిని ఎదుర్కోవడానికి నేను రేడియేషన్ సూట్ లో వస్తా అంటూ ప్రశాంత్ నీల్ వేసిన ట్వీట్ తో ఎన్టీఆర్ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. అంటే ఎన్టీఆర్ న్యూక్లియర్ ప్లాంట్ అంటే.. దాన్ని ఎదుర్కునే శక్తి రేడియేషన్‌కి మాత్రమే ఉంది. ఇక తాజాగా ప్రశాంత్ నీల్ పుట్టిన రోజునాడు మైత్రి మూవీస్ వారు ప్రశాంత్ కి విషెస్ చెప్పి త్వరలో రేడియేషన్ సూట్ లో కలుద్దాం అని ట్వీట్ చేశారు.
దానితో ఇప్పుడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాకి రేడియేషన్ అనే పదానికి లింక్ పెట్టేసారు. ఎన్టీఆర్ తో తియ్యబోయే కథకి కానీ, లేదా ఎన్టీఆర్ సినిమా టైటిల్ కి కానీ ఈ రేడియేషన్ అనే పదంతో ఏదో లింక్ అయ్యి ఉంటుంది అందుకే ప్రశాంత్ నీల్ అలా రేడియేషన్ అంటూ ఎన్టీఆర్ ని ఎదుర్కోబోతున్నాడంటూ ఫిలింనగర్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. కెజిఎఫ్ తో బాక్సులు బద్దలు చేసిన ప్రశాంత్ నీల్.. RRR తో దిమ్మతిరిగే క్రేజ్ కొట్టేస్తున్న ఎన్టీఆర్ లు కలిసి సినిమా అంటే అది కూడా రెడీయేషన్ అంత పవర్ ఉన్న సినిమా అంటే అది బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం అంటున్నారు. మరి కన్నడ ప్రేక్షకులు ప్రశాంత్ ని ఎన్ని మాటలన్నా ప్రశాంత్ మాత్రం ఎన్టీఆర్‌తో మూవీకే మొగ్గు చూపుతున్నాడు.