Advertisementt

ఆ గ్యాప్ లో మహేష్ మరో సినిమా చేస్తాడేమో..?

Sat 06th Jun 2020 12:04 PM
mahesh babu,rajamouli,parashuram,sarkaru vaari paata,rrr  ఆ గ్యాప్ లో మహేష్ మరో సినిమా చేస్తాడేమో..?
Will Mahesh do one more film in the gap.. ఆ గ్యాప్ లో మహేష్ మరో సినిమా చేస్తాడేమో..?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాని ప్రకటించేశాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినిమా అనంతరం అందరూ అనుకుంటున్నట్టు రాజమౌళి తో సినిమా ఉండే అవకాశం లేదని అంటున్నారు. రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యాక మహేష్ తో సినిమా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

మహేష్ కూడా రాజమౌళితో సినిమా ఉంటుందని చెప్పినప్పటికీ ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న రాజమౌళి, వచ్చే వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కోవిడ్ 19 మూలంగా షూటింగ్ మరింత నెమ్మదిగా జరగనుంది. సో విడుదల తేదీని ఇప్పుడప్పుడే చెప్పలేం. అదీగాక మహేష్ తో ఎలాంటి సినిమా తీయాలో రాజమౌళి ఇంకా అనుకోలేదు కూడా.

కథ కథనాలు ఇంకా పూర్తి కాలేదు. ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యాకే వాటి మీద కూర్చోనున్నాడు. సో ఆర్ ఆర్ ఆర్ విడుదల అయిన తర్వాత కూడా మహేష్ కి మరో ఆరు నెలల సమయం దొరుకుతుంది. ఈ టైమ్ లో మరో మూవీ చేసే అవకాశం ఉంది. మరి ఆ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందో చూడాలి.

Will Mahesh do one more film in the gap..:

Will Mahesh do one more film in the gap..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ