Advertisementt

హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా మృతి

Mon 08th Jun 2020 06:48 AM
chiranjeevi sarja,arjun sarja,son in law,kannada actor,no more  హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా మృతి
Action King Arjun Son in law Chiranjeevi Sarja is no more హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా మృతి
Advertisement
Ads by CJ

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఈ రోజు మథ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. సడెన్‌గా గుండెపోటు రావడంతో బంధువులు అతనిని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే చిరంజీవి సర్జా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని వయసు 39 సంవత్సరాలు. చిరంజీవి సర్జా ఇప్పటివరకూ 19 సినిమాల్లో నటించారు. 

1980 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా తొలి నాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు. అతని సోదరుడు నటుడు ధ్రువ సర్జా కన్నడనాట హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి సర్జాకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. నటి మేఘనా రాజ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి సర్జా ఆకస్మిక మరణంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. 

Action King Arjun Son in law Chiranjeevi Sarja is no more :

 Chiranjeevi Sarja passess away 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ