ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్, స్టార్ హీరోల పిక్స్ కాని.. పోస్ట్ కానీ పెడితే సోషల్ మీడియాలో ఆయా అభిమానులు లైక్స్, షేర్స్ తో హోరెత్తించేవారు. అయితే మీడియం రేంజ్ హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ పోస్ట్ లు, పిక్స్ పెడితే వేళల్లో లైక్స్ వచ్చేయి. అదే హాట్ హాట్ ఫొటోస్ షూట్స్ తో హీరోయిన్స్ సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేసారా.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తారు. తాజాగా అంటే కరోనా లాక్ డౌన్ లో సామాన్య మానవుడు కూడా పని లేక ఖాళీగా ఫోన్స్ పట్టుకుని తిరుగుతున్నారు. లేస్తే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టా అంటూ ఫోన్ లోనే తలలు పెట్టుకుని కరోనా లాక్ డౌన్ సమయాన్ని గడిపేస్తున్నారు. అందుకే ఇప్పుడు చిన్న చితక హీరోయిన్స్ ఎవరైనా పిక్ పోస్ట్ చెయ్యగానే వేలల్లో లక్షల్లో లైక్స్ వచ్చేస్తున్నాయి.
అదే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎవరైనా ఓ పిక్ పెట్టి పోస్ట్ చేసారా.. ఇక లక్షల్లో లైకులే లైకులు.., ఇదివరకు ఆ కౌంట్ వేలల్లో ఉండేది. ఇక చిన్న చిన్న హీరోలు, హీరోయిన్స్ పోస్ట్ పెడితే.. రెండు వేలో మూడు వేలో లైక్స్ వస్తే ఇప్పుడు అవి 25 వేలు, 30 వేలు ఉన్నాయి. మరి కరోనా లాక్ డౌన్ ముగియకపోతే ఇలాంటి సోషల్ మీడియా లైక్స్ మోత మాములుగా ఉండదు అంటున్నారు. అసలు ఈ లైక్స్ కి ఓ ఉదాహరణ, బాలీవుడ్ హాటెస్ట్ భామ ఊర్వశి రౌతులా.. గతంలో హాట్ ఫోటో పెడితే వేలల్లో లైక్స్ వచ్చేవి. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ సమయంలో హాట్ పిక్ పెట్టిందా ఇక లక్షల్లో లైక్స్ షేర్స్, కామెంట్స్. ఇలా ఉంది ప్రస్తుతం సోషల్ మీడియా వ్యవహారం.