Advertisementt

బాబాయ్‌పై స్పెషల్ వీడియో చేసిన అల్లు అయాన్!

Mon 08th Jun 2020 04:26 PM
allu ayaan,special video,uncle,allu sirish,allu arjun  బాబాయ్‌పై స్పెషల్ వీడియో చేసిన అల్లు అయాన్!
Allu Ayaan Special Video on His Uncle Allu Sirish బాబాయ్‌పై స్పెషల్ వీడియో చేసిన అల్లు అయాన్!
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటారు అనే విషయం తెలిసిందే. అల్లు శిరీష్ కూడా ఇదే రీతిన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో శిరీష్ పోస్ట్ చేసిన అనేక అప్డేట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయ్. తాజాగా స్టైల్ స్టార్ అల్లు అర్జున్, తన తనయుడుతో కలిసి ఉన్న ఒక వీడియో ని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అల్లు అయాన్ తన బాబాయ్ శిరీష్ పెళ్లి గురించి ఆపిల్ శిరి ని అడగటంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. 

అంతే కాదు ఇప్పటి వరకు తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే అల్లు శిరీష్ ని శిరి అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా అల్లు శిరీష్ కాస్త శిరిగా ఫేమస్ అయిపోయారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ కూడా ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేశారు. ఇక ప్రస్తుతం శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించిన పనుల్లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటనతో పాటు మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

Allu Ayaan Special Video on His Uncle Allu Sirish:

Allu Ayaan funny video about Allu Sirish goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ