Advertisementt

ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా బాలయ్య పాన్ ఇండియా మూవీ..?

Mon 08th Jun 2020 04:53 PM
balayya,balakrishna,adithya 369,singitham srinivasarao,boyapati,balayyabirthday celebrations  ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా బాలయ్య పాన్ ఇండియా మూవీ..?
Balayya will do a Sequel of Adithya 369..? ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా బాలయ్య పాన్ ఇండియా మూవీ..?
Advertisement
Ads by CJ

గత కొన్నేళ్ళుగా తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా మీద కన్నేసారు. బాహుబలి  ఇచ్చిన స్ఫూర్తితో స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఈ బాటలో సీనియర్ హీరో బాలయ్య కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. బాలక్రిష్ణ కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన సైన్స్ ఫిక్షన్  తో కూడిన ఫాంటసీ చిత్రం ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ గా పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్ని పోషించాడు. శ్రీ క్రిష్ణ దేవరాయలు పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడనే చెప్పాలి. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి చాలారోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయమై ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. సింగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య 369 సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేసారట. అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉండనుందట.

ప్రస్తుతానికి బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్యని అఘోరాగా చూడబోతున్నాం. విభిన్నమైన కథతో, విలక్షణమైన కథనంతో బోయపాటి ఈ సినిమాని సరికొత్తగా తీర్చిదిద్దనున్నాడట. కరోనా వల్ల షూటింగ్ నిలిచిపోయిన సినిమాకి మళ్లీ ఎప్పుడు కదలిక వస్తుందో చెప్పలేం..!

Balayya will do a Sequel of Adithya 369..?:

Balayya will do a Sequel of Adithya 369..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ