Advertisementt

‘విరాట పర్వం’ ఫస్ట్ అనుకున్న హీరో రానా కాదు!

Tue 09th Jun 2020 02:33 PM
virata parvam movie,first option,karthi,rana daggubati,director venu udugula  ‘విరాట పర్వం’ ఫస్ట్ అనుకున్న హీరో రానా కాదు!
Venu Udugula talks about Virata Parvam Movie ‘విరాట పర్వం’ ఫస్ట్ అనుకున్న హీరో రానా కాదు!
Advertisement
Ads by CJ

రానా హీరోగా, సాయి పల్లవి మెయిన్ కీలక పాత్రలో, ప్రియమణి కీ రోల్ లో తెరకెక్కుతున్న విరాట పర్వం సినిమా కరోనా లాక్ డౌన్ లేకపోతె ఈపాటికి థియేటర్స్ లోకి దిగిపోయేదే. కరోనా లాక్ డౌన్ అయినా విరాట పర్వం లుక్స్ తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసిన దర్శకుడు వేణు ఉడుగుల.. విరాట పర్వం ముచ్చట్లను మాట్లాడుతూ.. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఈ సినిమాలో హీరోగా ముందు రానా అని అనుకోలేదని.. కథ రాసుకున్నప్పుడు ఆ కథకి ఓ తమిళ హీరోయితే బావుంటుంది అని అనుకున్నా అని చెబుతున్నాడు. విరాట పర్వం కథ రాసుకున్నప్పుడు నా మైండ్ లో తమిళ హీరో కార్తీ అనుకుని కార్తీకి ఫిక్స్ అయ్యా అని చెప్పాడు.

విరాట పర్వం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు మాత్రం కార్తీ కేవలం తమిళంలోనే మార్కెట్ కలిగి ఉన్నాడు కానీ.. తెలుగులో మనం అనుకున్న మార్కెట్ కార్తీకి లేదు.. ఓ రీజనల్ హీరో అయితే బావుంటుంది అని.. అప్పుడు రానాకి ఫిక్స్ అయ్యానని చెబుతున్నాడు వేణు ఉడుగుల. ఇక మా సినిమాలో హీరోయిన్ గా ముందు నుండి సాయి పల్లవిని అనుకున్నా అని.. ఇక రానాకి కథ చెప్పగానే ఓకే చెప్పాడని అంటున్నాడు. ఇక సాయి పల్లవి నా మొదటి సినిమాలోనే హీరోయిన్ గా చెయ్యాల్సి ఉంది.. కానీ అప్పుడు ఆమె డేట్స్ దొరకని కారణంగా సాయి పల్లవిని ఈ సినిమాకి తీసుకున్నా అని... విరాట పర్వంలో సాయి పల్లవి నటన పరంగా ఇరగదీసింది అని చెబుతున్నాడు. 

Venu Udugula talks about Virata Parvam Movie:

Virata Parvam Movie First Option Karthi not Rana says Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ