Advertisementt

పెళ్లైన కొత్తలో భయం వేసింది: ఉపాసన

Tue 09th Jun 2020 05:14 PM
upasana,mega family,ram charan,after marriage,ram charan wife,surekha  పెళ్లైన కొత్తలో భయం వేసింది: ఉపాసన
Upasana interesting Comments on Mega Family పెళ్లైన కొత్తలో భయం వేసింది: ఉపాసన
Advertisement
Ads by CJ

మెగా కోడలు ఉపాసన ఇప్పుడు అటు చిరు ఫ్యామిలీని, ఇటు కామినేని ఫ్యామిలీని రెండింటిలోనూ తన పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తుంది. భర్త రామ్ చరణ్ కి తోడుగా... చిరు ఫ్యామిలీ తలలో నాలుకగా.. అపోలో హాస్పిటల్ లో తన వంతు బాధ్యతగా పని చేసే ఉపాసన రామ్ చరణ్ ని పెళ్లి చేసుకున్న కొత్తల్లో చాలా లావుగా ఉండేది. ఎంత ఆస్థి ఉన్నా.. రామ్ చరణ్ లావుపాటి అమ్మాయి అయిన ఉపాసనని పెళ్లి చేసుకోవడం మెగా ఫ్యాన్స్‌కి రుచించలేదు. అంత లావుగా ఉండే ఉపాసన మూడేళ్ళ క్రితం బాగా డైటింగ్, ఎక్సర్ సైజెస్ చేసి సన్నబడడమే కాదు... సన్నగా ఉండి.. ఆరోగ్యంగా ఉండాలనుంటే ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో, ఎలాంటి వర్కౌట్స్ చేయాలో ఉపాసన సోషల్ మీడియా ద్వారా చెబుతుంది.,

అయితే తాజాగా ఉపాసన తాను పెళ్ళైన కొత్తల్లో చాలా భయపడే దాన్ని అని, రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. చిరు ఫ్యామిలీ మొత్తం తెలిసిఉన్నప్పటికీ.. ఉపాసన చిరు ఇంట్లోకి అడుగుపెట్టిన కొత్తల్లో కాస్త భయపడేదట. పెళ్ళైన కొత్తల్లో అత్తారింట్లో ఏం తోచేది కాదని.. ఇంట్లో వాళ్ళు తనతో ఎలా బిహేవ్ చేస్తారో తెలియక భయపడే దాన్ని అని.. కానీ మా అత్తమ్మ సురేఖ మాత్రం తనను కూతురిలా ఆదరించింది అని, నేను ఏం చేసినా అత్తమ్మ సురేఖ అభ్యంతరం పెట్టేది కాదని.. ఆమె నాకు వెన్నంటే ఉండేదని.. ఉమ్మడి కుటుంబం నుండి వెళ్లిన నాకు మళ్ళీ ఉమ్మడి కుటుంబం దొరకడం ఆనందంగా ఉందని చెబుతుంది ఉపాసన.

Upasana interesting Comments on Mega Family:

Uncomfortable Upasana adjusted after marriage with Ram Charan?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ