నేను శైలజ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కీర్తి సురేష్, ఆ సినిమాలోళో పక్కింటి అమ్మాయిలా కనిపించి అందరి మనసుల్ని దోచేసింది. ఆ తర్వాత నేను లోకల్ చిత్రంలో నాని సరసన మెరిసింది. అయితే ప్రతీ ఒక్కరికీ ఒక బ్రేక్ త్రూ అనేది ఉంటుంది. అలా కీర్తికి లభించిన బ్రేక్ త్రూ మహానటి సినిమా. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ఆమె కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్ళింది.
నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ పెంగ్విన్ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ నెల 19వ తేదీన పెంగ్విన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో, హీరోయిన్ల నుండి కీర్తికి మద్దతు లభిస్తుంది. మొన్నటికి మొన్న టీజర్ రిలీజ్ కోసం నలుగురు హీరోయిన్లు రాగా, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కోసం ముగ్గురు హీరోలు ముందుకు వస్తున్నారు.
మళయాల వెర్షన్ ని రిలీజ్ చేయడానికి మోహన్ లాల్, తమిళం కోసం ధనుష్, తెలుగులో నాని పెంగ్విన్ ట్రైలర్ ని రేపు మద్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేయనున్నారు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవబోతున్నమొదటి పెద్ద సినిమా ఇదే కావడంతో అందరూ ఆసక్తిగా ఉన్నారు. కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు.