నీది నాది ఒకే కథ సినిమాతో ప్రేక్షకులకి మంచి అనుభూతిని అందించిన దర్శకుడు వేణు ఊడుగుల, తన రెండవ సినిమాగా విరాటపర్వాన్ని తెరకెక్కిస్తున్నాడు. రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా మీద మొదట్లో అంతగా ఆసక్తి లేదు. కానీ సినిమాల్లో నటించే నటీనటుల పుట్టినరోజులని పురస్కరించుకుని ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేసినప్పటి నుండి ఆకర్షించడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన మూడు పోస్టర్లకి విపరీతమైన స్పందన లభించింది.
తెలంగాణలోని 1990 కాలం నాటి నక్సలైట్ల కథతో ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమా కోసం ముందుగా రానాని అనుకోలేదట. విరాట పర్వం కథ రాసుకున్న వేణు ఊడుగుల యాక్షన్ హీరో గోపీచంద్ కి వినిపించాడట. గోపీచంద్ కి కథ నచ్చిందట కూడా. అయితే అప్పటికే గోపీచంద్ చేతిలో ఇతర సినిమాలు ఉండడంతో వేణుకి టైమ్ ఇవ్వలేకపోయాడట. దాంతో వేణు సురేష్ ప్రొడక్షన్ కి వెళ్ళాడట.
అయితే పోస్టర్స్ ద్వారానే ఆసక్తి కలిగిస్తున్న విరాట పర్వం సినిమా గోపీచంద్ చేసుంటే కెరీర్ పరంగా చాలా హెల్ప్ అయ్యుండేదని అంటున్నారు. కాకపోతే ఒకవేళ గోపీచంద్ హీరోగా చేసి ఉంటే ఈ సినిమాకి ఇంత హైప్ క్రియేట్ అయ్యుండేదా అనేది కూడా సందేహమే..!