Advertisementt

గోపీ వ‌ద్ద‌న్న‌ది బాల‌య్య‌కు.. బాల‌య్య వ‌ద్ద‌న్న‌ది గోపీకి!

Thu 11th Jun 2020 06:59 PM
balakrishna,gopichand,exchanged,stories,paruchuri murali,teja,ks ravikumar,ruler,jai simha,alivelumanga venkataramana  గోపీ వ‌ద్ద‌న్న‌ది బాల‌య్య‌కు.. బాల‌య్య వ‌ద్ద‌న్న‌ది గోపీకి!
Balakrishna and Gopichand Exchanged Their Movie Stories గోపీ వ‌ద్ద‌న్న‌ది బాల‌య్య‌కు.. బాల‌య్య వ‌ద్ద‌న్న‌ది గోపీకి!
Advertisement
Ads by CJ

‘రూల‌ర్‌’.. త‌మిళ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన మునుప‌టి మూవీ. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయిన ఈ సినిమాలో టోనీ స్టార్క్ (‘ఐర‌న్‌మ్యాన్‌’లో హీరో క్యారెక్ట‌ర్ పేరు) లుక్ ఒక్క‌టే వార్త‌ల్లో నిలిచింది. మిగ‌తా సినిమా అంతా చెత్త అనే పేరు తెచ్చుకుంది. అస‌లు ఈ సినిమా క‌థ బాల‌య్య‌కు ఎలా న‌చ్చింద‌ని ఆయ‌న ఫ్యాన్సే చికాకుప‌డ్డారంటే.. అది ఏ తీరున ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. రూల‌ర్ క‌థ‌ను అందించింది ప‌రుచూరి ముర‌ళి. స్వ‌యానా డైరెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ, బాల‌కృష్ణ‌ను ట్రిపుల్ రోల్‌లో చూపిస్తూ ‘అధినాయ‌కుడు’ అనే సినిమాను తీసిన‌ప్ప‌టికీ, ఆ క‌థ‌ను కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో చేయ‌డానికి ముర‌ళి ఇచ్చేశాడు.

నిజానికి ఆ క‌థ‌ను బాల‌కృష్ణ కోసం ఆయ‌న రాసుకోలేదు. మొద‌ట దాన్ని త‌న ఆంధ్రుడు హీరో గోపీచంద్‌కి చెప్పాడు ముర‌ళి. కానీ ఆ క‌థ గోపీకి న‌చ్చ‌లేదు. సున్నితంగా దాన్ని తిర‌స్క‌రించాడు. దాంతో ఆ స్టోరీని బాల‌య్య‌కు ముర‌ళి వినిపించాడ‌నీ, బాల‌య్య త‌న‌కున్న సెంటిమెంట్ల రీత్యా ఆ క‌థ‌ను కె.ఎస్‌. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో చేశాడ‌నీ వినిపిస్తోంది. ర‌వికుమార్ డైరెక్ష‌న్‌లో అదివ‌ర‌కు తాను చేసిన ‘జై సింహా’ సినిమా ఓ మోస్త‌రుగానైనా ఆడ‌టంతో, ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే చెయ్యాల‌ని బాల‌య్య ఫిక్స‌వ‌డంతో త‌న క‌థ‌ను ఇచ్చేశాడు ముర‌ళి.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు బాల‌య్య వ‌ద్ద‌న్న క‌థ‌ను గోపీచంద్ చేస్తున్నాడ‌నేది టాక్‌. అది తేజ డైరెక్ష‌న్‌లో రానున్న ‘అలిమేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ‌’. ఈ క‌థ‌ను చాలా కాలం క్రిత‌మే బాల‌య్య‌కు తేజ వినిపించాడంట‌. కానీ ఎందుచేత‌నో అది బాల‌య్య‌కు న‌చ్చ‌లేదు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తేజ డైరెక్ష‌న్‌లో చేయాల‌ని బాలకృష్ణ అనుకోవ‌డం, త‌ర్వాత ఆయ‌న‌ను త‌ప్పించి, ఆ బాధ్య‌త‌ల‌ను క్రిష్‌కు అప్ప‌గించ‌డం చూశాం. అప్పుడు బాల‌య్య వ‌ద్ద‌న్న క‌థ‌ను ఇప్పుడు గోపీతో చేయ‌డానికి రెడీ అవుతున్నాడు తేజ‌. అంటే గోపీకి ‘అలిమేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ’ క‌థ న‌చ్చింద‌న్న మాట‌. ఇందులో హీరోయిన్‌గా ఇంత‌కుముందు అనుష్క‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ పేర్లు వినిపించాయి. కానీ ఆ ఇద్ద‌రూ కాకుండా అలిమేలుమంగ క్యారెక్ట‌ర్‌ను ర‌కుల్ ప్రీత్ చేయ‌నున్న‌ద‌నేది లేటెస్ట్ న్యూస్‌. ఇదివ‌ర‌కు గోపీ, ర‌కుల్ జంట‌గా న‌టించిన ‘లౌక్యం’ చిత్రం సూప‌ర్ హిట్ట‌యింది. ఇప్పుడు తేజ ఆ ఇద్ద‌రినీ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

Balakrishna and Gopichand Exchanged Their Movie Stories:

Balayya movie to Gopichand and Gopichand movie to Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ