Advertisementt

RRR: యవ్వారం తారుమారవుతుంది..!

Fri 12th Jun 2020 06:51 PM
rrr,ram charan,jr ntr,rajamouli,shooting details,bollywood stars  RRR: యవ్వారం తారుమారవుతుంది..!
RRR: Jr NTR First, Ram Charan next RRR: యవ్వారం తారుమారవుతుంది..!
Advertisement
Ads by CJ

రాజమౌళి లాక్‌డౌన్ ముగియగానే RRR షూటింగ్ కి ఎప్పుడెప్పుడు వెళదామా అని కాచుకుని కూర్చున్నాడు. భారీ బడ్జెట్ సినిమాల పరిస్థితి అంతా ఇలానే ఉంది. అయితే రాజమౌళి ఆచార్య సినిమా కోసం RRR లోని రామ్ చరణ్ పాత్రని ముందు పూర్తి చేస్త్తాడు.. రామ్ చరణ్ వలన ఆచార్య ఆగకూడదని అనుకుని.. చరణ్ పార్ట్ ముందు తీసేసి ఎన్టీఆర్ కి అన్యాయం చేస్తున్నాడనే టాక్ ఉంది. రామ్ చరణ్ పార్ట్ పూర్తి చేసి ఎన్టీఆర్ సీన్స్ పూర్తి చేస్తాడన్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ షూటింగ్ అప్పుడే కాదని అంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అలాగే అజయ్ దేవగన్‌లకి సంబందించిన షూట్ అప్పుడే చెయ్యడం కుదరదట.

వారు ఇప్పుడప్పుడే RRR షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో.. అలియా భట్ తో లింక్ అయిన రామ్ చరణ్ సీన్స్, అజయ్ దేవగన్ తో లింక్ అయిన ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబో సీన్స్ ని అప్పుడే తియ్యడం కష్టమట, అందుకే ఎన్టీఆర్ కి సంబందించిన సన్నివేశాలను ముందు పూర్తి చేసి తర్వాత రామ్ చరణ్ సీన్స్ ని కంటిన్యూ చేస్తాడట రాజమౌళి. మరి ఇప్పుడు ఎన్టీఆర్ హ్యాపీగా RRR షూటింగ్ చేసి తర్వాత త్రివిక్రమ్ కోసం వెళితే.. రామ్ చరణ్ మాత్రం ఆచార్య విషయంలో RRR కి బాగా ఇరుక్కున్నాడన్నమాట. 

RRR: Jr NTR First, Ram Charan next:

RRR Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ