Advertisementt

అలాంటి మాటలు మాట్లాడవద్దని చెప్పిన ఐశ్వర్యా రాజేష్..!

Fri 12th Jun 2020 04:58 PM
aishwarya rajesh,vijay devarakonda,kousalya krishnamurthy,telugu,kollywood,  అలాంటి మాటలు మాట్లాడవద్దని చెప్పిన ఐశ్వర్యా రాజేష్..!
Dont use that words.. Says Aishwarya Rajesh..! అలాంటి మాటలు మాట్లాడవద్దని చెప్పిన ఐశ్వర్యా రాజేష్..!
Advertisement
Ads by CJ

కౌసల్య ష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఐశ్వర్యా రాజేష్, తమిళంలో 25కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో నటించిన మొదటి చిత్రం కౌసల్య క్రిష్ణమూర్తి అంతగా ఆడలేదు. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ లో సువర్ణ పాత్రలో కనిపించింది. ఈ సినిమా పరాజయం అయినా కూడా ఆ పాత్రకి మంచి పేరొచ్చింది.

ఇటు తెలుగులోనూ, తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తున్న ఐశ్వర్యా రాజేష్ కి సోషల్ మీడియాలో అభిమానులు బాగానే ఉన్నారు. సాధారణంగా హీరోయిన్లు అభిమానులతో ముచ్చటించడానికి లైవ్ లోకి వస్తారు. అంతే కాని వాళ్ళు పెట్టిన ఫోటోలకి వచ్చే కామెంట్లని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఐశ్వర్యా రాజేష్ తన ఫోటోకి కామెంట్ చేసిన నెటిజన్ కి సమాధానం ఇచ్చింది. 

తన అభిమాని అయిన ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చచ్చిపొమ్మన్నా చచ్చిపోతాను. మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు చాలా అందంగా ఉంటారని అన్నాడు. 

ఈ కామెంట్ కి స్పందించిన ఐశ్వర్యా, నువ్వు చూపించే అభిమానానికి చాలా థ్యాంక్స్, కానీ చచ్చిపోతాను వంటి మాటలు మాత్రం మాట్లాడకు. నీ లాంటి అభిమాని ఉండడం సంతోషమే అయినా చనిపోతాననే మాటలు మాట్లాడవద్దని కోరింది. ఒక నెటిజన్ కామెంట్ కి ఇంతలా స్పందించిన ఐశ్వర్యా రాజేష్ తీరు అందరికీ ఆశ్చర్యంగా ఉంది.

Dont use that words.. Says Aishwarya Rajesh..!:

Dont use that words.. Says Aishwarya Rajesh..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ