Advertisementt

‘నీకోసం నిరీక్షణ’గా ‘పదినారు వయదినిలే’!

Sat 13th Jun 2020 06:35 PM
16 vayathinile,neekosam neereekshanaa,kamal hassan,rajinikanth,sridevi  ‘నీకోసం నిరీక్షణ’గా ‘పదినారు వయదినిలే’!
16 Vayathinile turns Neekosam Neereekshanaa ‘నీకోసం నిరీక్షణ’గా ‘పదినారు వయదినిలే’!
Advertisement
Ads by CJ

క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జినికాంత్‌, శ్రీ‌దేవి కాంబినేష‌న్ సినిమా ఇప్పుడు సినిమా స్కోప్ డాల్బీ సౌండ్ తో డిజిట‌లైజ్డ్ వెర్ష‌న్ రిలీజ్ కి సిద్దం

భారత చలన చిత్ర పరిశ్రమలో నటదిగ్గజాలు అయినటువంటి మహానటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, మరియు అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘పదినారు వయదినిలే’. ఈ చిత్రం 4 రాష్ట్రీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి జాతీయ పురస్కారాన్ని మరియు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి, అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రానికి తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంత‌రం  మ‌రో అయిదు భాషల్లో డ‌బ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ.. ‘‘మధురమైన ఈ చిత్రం త‌ప్ప‌కుండా  ప్రేక్షకులను అలరిస్తుందని న‌మ్ముతున్నాను. ఇటీవ‌ల ఆదిత్య‌ మ్యూజిక్ ద్వారా 5 పాట‌ల‌ను విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గ‌ట్లుగా మార్పులు చేసి మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇళ‌య‌రాజా,

నిర్మాత‌: బామా రాజ్ కణ్ణు,

ద‌ర్శ‌క‌త్వం: భారతీరాజా.

16 Vayathinile turns Neekosam Neereekshanaa:

Kamal Hassan, Rajinikanth, Sridevi Starrer Is Digitally Restored With Cinema Scope And Dolby Sound... Ready To Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ