పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఏం చేసినా హీరోలకు అది వరమే. అందుకే ఆయనతో సినిమాల కోసం స్టార్ హీరోలు తహతహలాడుతున్నారు. తాజాగా ఆ వరం రామ్ చరణ్ - ఎన్టీఆర్ లకు తగిలింది. కథ చెప్పకుండానే RRR సినిమా కోసం హీరోలు సైన్ చేసారని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పాడు. అయితే రాజమౌళితో పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తూ పిచ్చ అంచనాలతో ఉన్న RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ తిరిగి ఆ క్రేజ్ కొనసాగించగలరా? బాహుబలితో ఐదేళ్లు కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత కిందా మీద పడుతున్నాడు. సాహోతో ప్లాప్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణతో సినిమా విషయంలోనూ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు.
మరి తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అదే పరిస్థితి వస్తుందేమోలే అని ఫ్యాన్స్ లో కంగారు ఉంది. ఎన్టీఆర్ మాత్రం ఎటువంటి హడావిడి లేకుండా త్రివిక్రమ్ తో సేఫ్ గేమ్ మొదలెట్టాడు. కానీ రామ్ చరణ్ మాత్రం మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు సరిపోయే కథ ఎందుకు తరవాత కూడా పాన్ ఇండియా మూవీ కావాలనే కోరికతో RRR తరవాత మరో మూవీ ఒప్పుకోకుండా వెయిట్ చేస్తున్నాడు. ఆచార్యతో కాస్త అంచనాలు తగ్గించుకుని మళ్ళీ పాన్ ఇండియా మూవీ చేద్దామని రామ్ చరణ్ ప్లాన్. ఎందుకంటే మళ్ళీ వెంటనే RRR తర్వాత ఆ రేంజ్ అంచనాలు అందుకోకపోతే ఎంత స్టార్స్ అయినా వాళ్ళ రేంజ్ తగ్గిపోతుంది. పాన్ ఇండియా మూవీ అందులోను భారీ క్రేజ్ ఉన్న మూవీ తర్వాత చిన్న చిన్నసినిమాతోనే సరిపెట్టుకుంటే ఓకే.. కాదు మళ్ళీ పాన్ ఇండియా అంటూ రాంగ్ స్టెప్ వేస్తే కష్టం. మరి రామ్ చరణ్ ఏం ఆలోచిస్తాడో చూడాలి. కానీ RRR రేంజ్ సినిమా తర్వాత ఆ క్రేజ్ ని ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ కొనసాగించాలంటే కష్టం.