Advertisementt

రాజమౌళి టెస్ట్ షూట్ కి అన్నీ రెడీ..!

Mon 15th Jun 2020 03:30 PM
rrr,rajamouli,ntr,ram charan,dvv entertainments  రాజమౌళి టెస్ట్ షూట్ కి అన్నీ రెడీ..!
Rajamouli is ready for test shoot..! రాజమౌళి టెస్ట్ షూట్ కి అన్నీ రెడీ..!
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. సుమారు రెండు నెలలకి పైగానే షూటింగ్స్ కి గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలు షూటింగులకి అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడట. ఈ మేరకు అన్ని సమకూర్చుకుంటున్నాడని టాక్.

మొదటగా టెస్ట్ షూట్ చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ముందుకి వెళ్తాడట. టెస్ట్ షూట్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిర్వహిస్తారట. అందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డూప్ లతో ఈ చిత్రీకరణ నిర్వహించనున్నారని తెలుస్తుంది. సుమారు 50 మంది సిబ్బందితో సీన్స్ చిత్రీకరించనున్నారట.

ప్రభుత్వం సూచించిన అన్ని మార్గదర్శకాలని పాటిస్తూ, కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ట్రయల్ షూట్ నిర్వహిస్తారట. టెస్ట్ షూట్ గనక సక్సెస్ అయితే ఇక రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది వేసవిలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

Rajamouli is ready for test shoot..!:

Rajamouli is ready for test shoot..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ