Advertisementt

‘ఫ్యామిలీ ప్యాక్’ మోషన్ పోస్టర్ విడుదల

Wed 17th Jun 2020 07:12 AM
family pack movie,kannada superstar,puneet rajkumar,presents,family pack,motion poster  ‘ఫ్యామిలీ ప్యాక్’ మోషన్ పోస్టర్ విడుదల
Family Pack Movie Motion Poster Released ‘ఫ్యామిలీ ప్యాక్’ మోషన్ పోస్టర్ విడుదల
Advertisement
Ads by CJ

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదో సినిమాగా ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లిఖిత్ శెట్టి, అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మోషన్ పోస్టర్ చూస్తుంటే యూత్ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తుందీ చిత్రం. ఈ ఫస్ట్ లుక్ కోసం ఓ కాంటెస్ట్ ను కూడా పెట్టింది యూనిట్.

‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మూవీ మోషన్ పోస్టర్ ని చూసి అక్కడ కనిపిస్తున్న జంట రిలేషన్ ఎంటో గెస్ చేసి ట్విట్టర్ లో కామెంట్ చేసిన 5 మందికి జె.బి.ఎల్ స్పీకర్లను అందజేస్తుంది మూవీ టీం. దీని కోసం ట్విట్టర్ లో #FamilyPack అని టైప్ చేసి సెర్చ్ చేసి కామెంట్ చేయవచ్చు.

పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, లిఖిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎస్.అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకు ముందు లిఖిత్ శెట్టి-అర్జున్ కుమార్ కలిసి ‘‘సంకష్టకారా గణపతి’’ అనే మూవీ తీసారు. 2018 లో అమెజాన్ లో ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది.

Family Pack Movie Motion Poster Released:

Family Pack Movie details Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ