సుశాంత్ సింగ్ బలవన్మరణం బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా డిప్రెషన్ కి లోనవుతున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఈ విషయమై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది. వారసత్వం వల్లే సుశాంత్ అవకాశాలు దెబ్బతిన్నాయని, అందుకే అతడు తన ప్రాణాలు తీసుకున్నాడంటూ కంగనా రనౌత్ లాంటి హీరోయిన్ నెపోటిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
చాలా మంది సెలెబ్రిటీలు ఈ విషయమై నోరు విప్పి బాలీవుడ్ వారసత్వంపై దుమ్మిత్తి పోస్తున్నారు. తమ అవకాశాలని తన్నుకుపోతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, వారసత్వం ప్రతీ చోటా ఉంది. రాజకీయాల నుండి మొదలు పెడితే, వ్యాపారాల వరకూ ప్రతీ చోటా వారసత్వం ఉంది.
ఇంకా మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ ఒకేలాంటి వారే కదా, వారే ఒక ఇరవై ఏళ్లయ్యాక తమ కొడుకులని తీసుకు వస్తున్నారని, ఇప్పుడు వారసత్వంపై స్పీచులు ఇస్తున్న వారు మరో ఇరవై ఏళ్లయ్యాక వారి కొడుకులని, కూతుళ్లని తీసుకురారా అని ప్రశ్నించాడు. మొత్తానికి బాలీవుడ్ నెపోటిజంపై గొడవ ఇప్పట్లో తేలేలా లేదు.