వరుస ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్, ఆ తర్వాత ప్రతీరోజూ పండగే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి రిలీజైన నో పెళ్ళి అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడిన ఈ చిత్రం థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదల కానుంది.
ఇదిలా ఉంటే, సాయి ధరమ్ తేజ్ తన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ ఎంట్రీపై చాలా ఆసక్తిగా ఉన్నాడట. పంజా వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఉప్పెన చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడట.
ఉప్పెన, తమ్ముడి కెరీర్లో మంచి చిత్రంగా నిలవబోతుందని నమ్ముతున్నాడట. అందుకే తన సినిమా కంటే ఉప్పెన చిత్రం మీదే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. క్రితి శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఉప్పెన చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.