తెలుగు సినిమాలకి మార్కెట్ పెరిగిందని, తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. గతంలోలా ఫార్ములా బేస్డ్ సినిమాలు కాకుండా తెలుగు సినిమాల్లో చాలా ఛేంజ్ వచ్చిందని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలని హిందీలో రీమేక్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు.
ఇప్పటికే చాలా సినిమాలు హిందీలో రీమేక్ కి వెళ్లాయి. సింబా, కబీర్ సింగ్ చిత్రాలు ఎంతటి బ్లాక్ బస్టర్స్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇంకా భాగమతి, ఆర్ ఎక్స్ 100, జెర్సీ, అల వైకుంఠపురములో మొదలగు చిత్రాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి. అయితే మన సినిమాల కోసం బాలీవుడ్ నిర్మాతలు వస్తుంటే, మనమేమో మళయాల సినిమాల వెంటపడుతున్నాం. గత కొన్ని రోజులుగా మన దర్శకనిర్మాతల దృష్టి మళయాల చిత్రాల మీద పడింది.
ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ చిత్ర హక్కుల్ని కొనుక్కుని సాహో డైరెక్టర్ సుజిత్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. అదే గాక డ్రైవింగ్ లైసెన్స్ అనే మరో చిత్ర రీమేక్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇంకా సితార ఎంటర్ టైన్ మెంట్స్ అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ హక్కుల్ని కొనిపెట్టుకుంది. ఈ రీమేక్ లో ఎవరు నటిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు.
తాజాగా పీవీపీ ఎంటర్ టైన్ మెంట్స్ హెలెన్ అనే సినిమా తెలుగులో రీమేక్ చేయబోతుందట. ఈ మిస్సింగ్ థ్రిల్లర్ లో ఎవరు నటిస్తారో చూడాలి. మొత్తానికి బాలీవుడ్ మన సినిమాలని హిందీలో రీమేక్ చేస్తుంటే, మనమేమో మళయాల చిత్రాలని తెలుగులోకి తెస్తున్నాం..