Advertisementt

కాజ‌ల్ క‌రిష్మా మామూలుగా లేదు!

Fri 19th Jun 2020 06:26 AM
kajal agarwal,birthday special,heroine,magadheera,busy heroine  కాజ‌ల్ క‌రిష్మా మామూలుగా లేదు!
Special Article on Kajal Agarwal కాజ‌ల్ క‌రిష్మా మామూలుగా లేదు!
Advertisement
Ads by CJ

కొంత‌మందికి ఎంత‌కాలం ఎదురుచూసినా బ్రేక్ రాదు. కొంత‌మంది తొలి సినిమాతోటే సంచ‌ల‌నం సృష్టిస్తుంటారు. ఇంకొంత‌మందికి అనుకోని విధంగా ఓ సినిమా అనూహ్య‌మైన గుర్తింపుని తీసుకొస్తుంది ఈ మూడో కోవ‌కు చెందిన తార కాజ‌ల్ అగ‌ర్వాల్‌. య‌స్‌.య‌స్. రాజ‌మౌళి రూపొందించిన ‘మ‌గ‌ధీర’ చిత్రంలో హీరోయిన్ మిత్ర‌వింద‌/ ఇందు పాత్ర‌తో తెలుగువాళ్ల ఆరాధ్య తార‌గా మారిపోయింది.

నిజానికి మిత్ర‌వింద పాత్ర‌కు త‌మ‌న్నా అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌ అల్లు అర‌వింద్ భావించారు. కానీ అదివ‌ర‌కు కృష్ణ‌వంశీ చేసిన ‘చంద‌మామ‌’లో ఆమె న‌ట‌న‌కు ఫిదా అయిన రాజ‌మౌళి ఆమెలో యువ‌రాణి మిత్ర‌వింద‌ను చూశాడు. ఫొటోషూట్ చేశాక ఆయ‌న న‌మ్మ‌కం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఇక్క‌డ ఇంకో నిజం ఏమంటే అదివ‌ర‌కు రాజ‌మౌళి తీసిన ‘య‌మ‌దొంగ’ సినిమాలో తార‌క్ జోడీగా కాజ‌ల్‌ను తీసుకోవాల‌ని భావించాడు కానీ, అప్పుడు వీలు కాలేదు. ‘మ‌గ‌ధీర’ విష‌యంలో రాజ‌మౌళి న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు కాజ‌ల్‌. ఇటు ఇందూగా, అటు మిత్ర‌వింద‌గా అమోఘంగా రాణించింది. ముఖ్యంగా మిత్రివింద పాత్ర‌లో కాజ‌ల్ మ‌న‌కు క‌నిపించ‌దు, క‌నిపించేది మిత్ర‌విందే. ముచ్చ‌టైన మోముతో ఆమె ప‌లికించిన హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల్నీ మెప్పించాయి. ఆ సినిమా త‌ర్వాత చాలా రోజుల పాటు మిత్ర‌వింద పాత్ర మ‌న‌ల్ని వెన్నాడుతూ వ‌చ్చింది.

ఆ త‌ర్వాత కాలంలో అల్లు అర్జున్‌తో ‘ఆర్య 2’, ప్ర‌భాస్‌తో ‘డార్లింగ్‌’, ‘మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌’, జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ‘బృందావ‌నం’, ‘బాద్‌షా’, ‘టెంప‌ర్‌’, మ‌హేశ్‌తో ‘బిజినెస్‌మేన్‌’, రామ్‌చ‌ర‌ణ్‌తో ‘నాయ‌క్‌’, చిరంజీవితో ‘ఖైదీ నంబ‌ర్ 150’, రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. నాని నిర్మించిన ‘అ!’ మూవీలో ఒక వైవిధ్య‌మైన క్యారెక్ట‌ర్‌తో న‌టిగా త‌నేమిటో చూపించింది. ‘జ‌న‌తా గ్యారేజ్‌’లో స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది. త‌మిళంలోనూ అగ్ర హీరోల‌తో న‌టించి, అక్క‌డ కూడా అగ్ర‌శ్రేణి హీరోయిన్‌గా రాణిస్తూ వ‌స్తోంది.

కొంత‌కాలం క్రితం టాలీవుడ్‌లో కెరీర్ మ‌స‌క‌బారుతున్న స‌మ‌యంలో మెగాస్టార్ క‌మ్‌బ్యాక్ ఫిల్మ్‌ ‘ఖైదీ నంబ‌ర్ 150’లో హీరోయిన్‌గా వ‌చ్చిన ఛాన్స్‌ను రెండు చేతులా ఒడిసి ప‌ట్టుకొని, ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. చిరుతో ఆమె చేసిన డ్యాన్సులు, ‘అమ్మ‌డూ లెట్స్ డూ కుమ్ముడూ’ పాట‌లో ఆమె క‌నిపించిన తీరు ర‌సికుల్ని బాగా అల‌రించాయి. కాజ‌ల్ ప‌ని ఖాళీ అనుకున్న‌వాళ్లు ఆశ్చ‌ర్య‌పోయేలా ఆమె వ‌రుస అవ‌కాశాలు పొందుతూ వ‌స్తోంది. ఇప్పుడు మూడు భాష‌ల్లో మూడు కీల‌క చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగులో రెండోసారి మెగాస్టార్ స‌ర‌స‌న ‘ఆచార్య’ సినిమా చేస్తున్న కాజ‌ల్‌, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ జోడీగా ‘ఇండియ‌న్ 2’ ఫిల్మ్‌లో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో జాన్ అబ్ర‌హాం, ఇమ్రాన్ హ‌ష్మి, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్‌లు న‌టిస్తోన్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ముంబై సాగా’లో హీరోయిన్ క్యారెక్ట‌ర్ చేస్తోంది. 34 వ‌య‌సులోనూ త‌న‌లో క‌రిష్మా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూ, ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది కాజ‌ల్‌.

Special Article on Kajal Agarwal :

Kajal Agarwal Birthday special article

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ