Advertisementt

రకుల్ చెబుతున్న సౌత్ పాఠాలు విన్నారూ..!

Sat 20th Jun 2020 06:09 PM
rakul preet singh,south cine industry,love,heroine,bollywood,praises  రకుల్ చెబుతున్న సౌత్ పాఠాలు విన్నారూ..!
Rakul Preeth Singh Praises South Cine Industry రకుల్ చెబుతున్న సౌత్ పాఠాలు విన్నారూ..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సౌత్‌లో సినిమా అవకాశాలు లేక బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను చేసుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ సినిమాల్లో చేసిన అనుభవం తనకి బాలీవుడ్ సినిమాల్లో పనికొస్తుంది అని చెబుతుంది. అసలు తనకి సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదట. చిన్నప్పుడు అబ్బాయిలా ఫోజులు కొడుతూ టామ్ బాయ్ లా ఉండేదాన్ని అని చెబుతుంది. కాలేజ్ కి వచ్చాకే తనకి నటనమీద ఆసక్తి కలిగి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టా అని చెబుతుంది రకుల్ ప్రీత్ సింగ్. మోడలింగ్ తర్వాత నటిగా మారానని చెబుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రాంతీయ చిత్రాల్లో నటిస్తానని అనుకోలేదట. కానీ తండ్రి ప్రోత్సాహంతో తెలుగు సినిమాలు చేశా అని.. తర్వాత అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేసానని చెబుతుంది.

సౌత్ లో చేసిన సినిమాలతో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా అని చెబుతున్న రకుల్ ప్రీత్, సౌత్... ప్రాంతీయ భాష చిత్రాలతోనే నటిగా నన్ను నేను పూర్తిస్థాయిలో మలుచుకున్నా అని చెబుతుంది. నేనిప్పుడు సొంతంగా కథలు విని బాలీవుడ్ సినిమాలు చేస్తున్నా అంటే అది సౌత్ సినిమాల వలనే అని చెబుతుంది. దక్షిణాది చిత్రాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని.. బాలీవుడ్ లో ఏ పాత్రలకు నేను సరిపోతాను, ఏ కథకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాను, నాకు ఎలాంటి పాత్రలు నప్పుతాయి. నేను ఎలాంటి కథలకు సరిపోతాను అని బేరీజు వేసుకోవడంతో సౌత్ సినిమాలు నాకు హెల్ప్ చేసాయంటుంది రకుల్. మరి ఇక్కడ అవకాశాలు తగ్గాకే బాలీవుడ్‌లో అడుగుపెట్టానని మాత్రం చెప్పదు పాప.

Rakul Preeth Singh Praises South Cine Industry :

Rakul Preeth Singh Learned Everything From South

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ