‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ దొరికాక ఏకంగా పూరి జగన్నాధ్ కి విజయ్ దేవరకొండ ఆఫర్ ఇచ్చాడు. అది కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో పూరితో కలిసి ఛార్మి పార్టీ చేసుకున్నారు. అదే ఊపులో ముంబై నేపథ్యం ఉన్న కథతో ఫైటర్ సినిమాని ముంబై పరిసర ప్రాంతాల్లో 40 శాతం షూటింగ్ కూడా చేసేసారు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా, విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్న ఈ సినిమా కథ మొత్తం ముంబై చుట్టూనే తిరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనాతో మహారాష్ట్ర గజగజ వణుకుతుంది. అందులోను ముంబై మరీనూ. దానితో పూరి జగన్నాధ్ - ఛార్మి, విజయ్ సినిమా విషయంలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లారు. అందుకే ముంబైలో చేయాల్సిన షూటింగ్ ని హైదరాబాద్‌లోనే సెట్ వేసుకుని చేస్తారనే ప్రచారం జరిగింది.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా, ఫైటర్‌గా కనిపించనున్నాడు. అందుకోసమే విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ బాడీ కూడా డెవలప్ చేసాడు. అయితే ఈ సినిమా కథ ఆధారంగా విజయ్ దేవరకొండ విదేశీ ఫైటర్స్‌తో ఫైటింగ్ చేసే కొన్ని సీన్స్ ఉన్నాయట. మరి ఇక్కడని లేదు అక్కడని లేదు.. ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా విలయతాండవం కొనసాగుతుండటంతో విదేశీ ఫైటర్స్‌తో ఫైటింగ్ చేసే సన్నివేశాలను విదేశీ ఫైటర్స్‌తో సాధ్యపడదని భావించి లోకల్ ఫైటర్స్‌తో ఈ ఫైటింగ్ సీన్స్ తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట పూరి బ్యాచ్. అందుకోసం స్క్రిప్ట్ లో భారీ మార్పులు కూడా చెయ్యాల్సి వచ్చేలా ఉందట. మరోపక్క విదేశాల్లో తెరకెక్కించాల్సిన సీన్స్ ని హైదరాబాద్ లోనే కొన్ని ప్రత్యేకమయిన లొకేషన్స్ లో తెరకెక్కించే ప్లాన్ చేస్తుందట పూరి అండ్ ఛార్మి బృందం. అందుకే ఇప్పుడు కరోనా వలన పూరి జగన్నాధ్ కి ఛార్మికి సినిమా కష్టాలంటే ఏంటో బాగా తెలిసొచ్చింది అంటున్నారు.