Advertisementt

‘నరుడి బ్రతుకు నటన’ మోషన్ టీజర్ విడుదల

Sun 21st Jun 2020 05:11 PM
narudi brathuku natana,motion teaser,narudi brathuku natana movie,yoga day special  ‘నరుడి బ్రతుకు నటన’ మోషన్ టీజర్ విడుదల
Narudi Brathuku Natana Motion teaser Released ‘నరుడి బ్రతుకు నటన’ మోషన్ టీజర్ విడుదల
Advertisement
Ads by CJ

యోగా డే రోజు కాకుండా ప్రతి డే మన లైఫ్ లో యోగా ఉంటేనే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది: హీరో తల్లాడ సాయికృష్ణ

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ సినిమా ‘నరుడి బ్రతుకు నటన’. తల్లాడ సాయికృష్ణ, మాధురి హీరో హీరోయిన్లుగా తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మోషన్ టీజర్‌ని యోగా డే సందర్భంగా విడుదల చేసింది చిత్ర బృందం.

‘యోగా’ అంటే మనిషి యొక్క అనంతమైన మేధా శక్తి, మనో బలంతో సాధన చేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే ‘నరుడి బ్రతుకు నటన’.. అనే డైలాగ్ తో ఉన్న ఈ మోషన్ టీజర్ నెటిజన్లని ఆకర్షిస్తున్నట్లు, ప్రముఖ గ్రాఫిక్స్ డిజైనర్ రాహుల్ అందించిన గ్రాఫిక్స్ వలన మోషన్ టీజర్ కి ప్రత్యేకత కలిగిందని దర్శకుడు జానీ తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ యోగా డే సందర్భంగా మేము ఈ మోషన్ టీజర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది, అలానే ఈ సినిమాలో

కథాంశం అంత యోగా చుట్టూ తిరుగుతుంది. తెలుగు సినిమాలలో యోగాని ఆధారం చేసుకుని హార్రర్ సినిమాలు రాలేదు, అతి తక్కువ కథలు యోగా మీద ఉన్నాయి అందులో మా సినిమా కూడా ఉండబోతుంది అని తెలిపారు. 

హీరో తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. శివ కాకు అందించిన కథ, మాటలలో ఉన్న ఒక్క డైలాగ్ నే మేము ఈ మోషన్ టీజర్ లో ఉపయోగిస్తే ఇంత రెస్పాన్స్ వచ్చింది, రేపు సినిమా విడుదల అయ్యాక ఖచ్చితం గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది, యోగా మానవ జీవితంలో భాగం అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సినిమాకి

కథ, మాటలు- శివ కాకు,

కెమెరా- శ్యామ్ అండ్ ఆర్ ఎస్ శ్రీకాంత్

ఎడిటింగ్- శ్రీకాంత్ కురెళ్లి

గ్రాఫిక్స్- రాహుల్ చిల్లలే

సౌండ్ ఎఫెక్ట్స్- వెంకట్

టీజర్ కట్ మ్యూజిక్- వి.ఆర్ ఏ ప్రదీప్.

ఫైట్స్- శ్యామ్ కరద

పి.ఆర్.ఓ- పవన్.

Narudi Brathuku Natana Motion teaser Released:

Narudi Brathuku Natana Yoga Day Speical Motion teaser released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ