Advertisementt

నాని కోసం ముగ్గురు హీరోయిన్లు..?

Sun 21st Jun 2020 10:47 AM
nani,shyam singaroy,rashi khanna,nivetha thomas  నాని కోసం ముగ్గురు హీరోయిన్లు..?
Three heroins in Nanis next..? నాని కోసం ముగ్గురు హీరోయిన్లు..?
Advertisement
Ads by CJ

గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వి సినిమా కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఇంకా రిలీజ్ కాలేదు. అన్నీ కుదురుకుని థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న సినిమాల్లో వి మొదటి స్థానంలో ఉంటుంది. వి సినిమా షూటింగ్ లో ఉండగానే నాని, తన తర్వాతి రెండు చిత్రాలని ప్రకటించాడు. అయితే అందులో రాహుల్ సాంక్రిత్యయాన్ దర్శకత్వంలో రూపొందనున్న శ్యామ్ సింగరాయ్ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

కథా ప్రకారం సినిమా షూటింగ్ కోల్ కతాలో జరుపుకోవాల్సి ఉండడంతో, కరోనా వల్ల అది వీలు కాదన్న ఉద్దేశ్యంతో ఆగిపోయిందని అన్నారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయట. రాహుల్ సాంక్రిత్యయాన్ ఈ సినిమాలో నటించే నటీనటులని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడట. ఇందులో భాగంగా హీరోయిన్లని వెతుకుతున్నాడని అంటున్నారు. 

ఈ సినిమాలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లని ఎంపిక చేయనున్నారట. ఇందుకోసం రష్మిక మందన్న, సాయి పల్లవి, నివేథా థామస్, నిధి అగర్వాల్, రీతూ వర్మ, రాశీ ఖన్నా పేరల్ని పరిశీలించనున్నారట. ఈ ఆరుగురిలో ముగ్గురు హీరోయిన్లని ఎంపిక చేస్తారట. మరి నాని సరసన నటించే  ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరో చూడాలి.

Three heroins in Nanis next..?:

Three heroins in Nanis next..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ