Advertisementt

‘వకీల్‌సాబ్’ తర్వాతే.. ఏదైనా అంటున్న పవన్!

Mon 22nd Jun 2020 09:12 AM
vakeel saab,pawan kalyan,krish,harish shankar,shootings,pawan stand  ‘వకీల్‌సాబ్’ తర్వాతే.. ఏదైనా అంటున్న పవన్!
Pawan Kalyan Stand on his next Movies ‘వకీల్‌సాబ్’ తర్వాతే.. ఏదైనా అంటున్న పవన్!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్స్‌కి ప్రభుత్వాల నుండి అనుమతులు లభించడంతో. ప్రతి ఒక్కరూ పొలోమని సెట్స్ మీదకెళ్తారు అనుకుంటే.. స్టార్ హీరోల సినిమాలేవీ ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. హైదరాబాద్‌లోనే ఏదో ఓ సెట్ వేసి చిత్రీకరణ చేద్దామనుకుంటే.. కరోనా హైదరాబాద్‌లోను విజృంభించడంతో.. ఎక్కడివాళ్ళక్కడ ఆగిపోయాయిరు. అసలు స్టార్ హీరోలైతే తమ సినిమాల ఊసే ఎత్తడం లేదు. అయితే మిగతా హీరోల సంగతెలా ఉన్నా అందరికన్నా ముందు వకీల్ సాబ్ షూటింగ్ మొదలవుతుంది అనుకుంటే... వకీల్ సాబ్ టీం పత్తాలేదు. కారణం పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాకపోవడమే. పోనీ పవన్ వచ్చేవరకు వేరే సీన్స్ షూట్ చేసి పవన్ సీన్స్ తర్వాత చేద్దామనుకుంటే.. ప్రస్తుతం ట్రయిల్ షూట్స్ కూడా ఆగాయి.

అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌తో పాటుగా క్రిష్ సినిమా మొదలెట్టాడు. ఓ షెడ్యూల్ కూడా అయ్యింది. లాక్‌డౌన్‌తో అదీ వాయిదాపడింది. అయితే వకీల్ సాబ్ మొదలెట్టాక క్రిష్ సినిమాని కూడా పవన్ మొదలెడతాడనుకుంటే.. ఈలోపు క్రిష్ సినిమాని పక్కనబెట్టి హరీష్ శంకర్ సినిమాని పవన్ మొదలెట్టబోతున్నాడనే వార్తలు చూసి క్రిష్ నిర్మాత ఏ ఏం రత్నం పవన్ ని కలిసి క్రిష్ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యమని అడిగాడట. కానీ పవన్ కళ్యాణ్ షూటింగ్స్ ఎప్పుడు మొదలైనా ముందు వకీల్ సాబ్ అవనీయండి తర్వాతే వేరే షూటింగ్ అంటూ దాటవేశాడట. వకీల్ సాబ్ ముందు పూర్తి చేసి అది విడుదలయ్యాకే క్రిష్ సినిమా కానీ, హరీష్ సినిమాని కానీ అనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చేసాడట. దానితో క్రిష్, ఏ ఏం రత్నం కూడా పవన్ చెప్పినదానికి ఊ కొట్టి వదిలేసారట. 

Pawan Kalyan Stand on his next Movies:

After Vakeel Saab.. Pawan Kalyan Fixed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ