Advertisementt

రానా ఇచ్చిన హింట్.. ఆ సినిమా ఓటీటీలోనే..?

Sun 21st Jun 2020 03:09 PM
rana daggubati,suresh productions,shraddha srinath,seerat kapoor,ravikanth perepu  రానా ఇచ్చిన హింట్.. ఆ సినిమా ఓటీటీలోనే..?
Will rana release that movie in OTT..? రానా ఇచ్చిన హింట్.. ఆ సినిమా ఓటీటీలోనే..?
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో సినిమా ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులని ఎదుర్కుంటుంది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో చిన్న సినిమా నిర్మాతలు తమ చిత్రాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలనే భావనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు  తెరకెక్కించిన చిత్రం ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.

గుంటూర్ టాకీస్ సినిమా ద్వారా ప్రేక్షకులకి సుపరిచితమైన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన క్రిష్ణ అండ్ హిస్ లీల అనే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సీరత్ కపూర్, శ్రద్ధా శ్రీనాథ్, షాలినీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది.

ఈ విషయమై రానా దగ్గుబాటి చిన్న క్లూ ఇచ్చాడు. సినిమా గురించి ట్విట్టర్ ద్వారా స్పందించిన రానా, పుకార్లు వచ్చిన విధంగానే ఈ సినిమా మీరు ఊహించిన దానికంటే తొందరగా మీ ముందుకు వచ్చేస్తోంది అని ట్వీట్ చేసాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకి రావడం అంటే ఓటీటీలో రిలీజ్ అవడమే. అంటే క్రిష్ణ అండ్ హిస్ లీల చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకులకి రాబోతుందని అర్థం చేసుకోవచ్చని తెలుస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.

Will rana release that movie in OTT..?:

Will rana release that movie in OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ