యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమా నుండి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా టైటిల్ కూడా రివీల్ చేయకపోవడంతో అభిమానుల్లో ఒకరకమైన అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్దేట్ బయటకి వచ్చింది. జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ లవ్ డ్రామాకి మ్యూజిక్ ఎవరు అందించనున్నారనేది ఆసక్తిగా మారింది.
పూజా హెగ్డే హిరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ అందించేది అమిత్ త్రివేది అంటూ వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ 20వ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం ఇవ్వనున్నాడని అంటున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, ఆల్రెడీ రెండు పాటలకి ట్యూన్లు ఇచ్చాడని కూడా అంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసినప్పుడే సాంకేతిక నిపుణుల గురించి కూడా అప్డేట్ ఇవ్వనున్నారట.
జస్టిన్ ప్రభాకరన్ విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ సినిమాలోని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది.