ఫైటర్ కోసం విజయ్ దేవరకొండ హెయిర్ స్టయిల్ బాగా పెంచి పిలక వేసుకునే స్టయిల్‌లో ఉన్నాడు. పూరి జగన్నాధ్ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా సిక్స్ ప్యాక్ లుక్ లో కనబడుతున్నాడు. అయితే పాన్ ఇండియా లెవల్లో ముంబై నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 40 శాతం పూర్తయ్యాక కరోనా మహమ్మారి ఈ షూటింగ్ కి బ్రేక్ వేసింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసిన మూవీ టీం ఎవరిళ్ళలో వాళ్ళు కరోనా లాక్‌డౌన్‌ని గడిపేస్తున్నారు. మధ్యలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఉద్యోగుల కోసం ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేసాడు. అలాగే తెలంగాణ పోలీసులలో నూతన ఉత్తేజం నింపడానికి తన వంతు కృషిని చేశాడు. అయితే విజయ్ దేవరకొండ ఓ నెల రోజులుగా సోషల్ మీడియాలో అందుబాటులో లేడు.
అయితే నిన్న ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ తన తండ్రితో ఉన్న పిక్ ఒకటి పోస్ట్ చేసి ఫాదర్స్ డే విశెష్ చెప్పాడు. అయితే ఆ పిక్ లో విజయ్ దేవరకొండ లుక్ కాస్త డిఫరెంట్‌గా కనబడుతున్నాడు. విజయ్ దేవరకొండ హెయిర్ బాగా పెంచెయ్యడమే కాదు... ఓ డిఫ్రెంట్ గెడ్డం లుక్ లో కొత్తగా కాస్త విభిన్నంగానే కనబడుతున్నాడు. ఫైటర్ లుక్ లో మంచిగా కనబడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ కొత్త లుక్ చూసి ఆయన అభిమానులే ఏంది భయ్యా ఈ లుక్ అంటున్నారు. హెయిర్ బాగా పెరిగి, ఫ్రెంచ్ ట్యాప్ గెడ్డంతో కనబడుతున్న విజయ్‌కి ఆ లుక్ అంతగా నప్పలేదు.. కానీ లాక్ డౌన్ వలన విజయ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యి తన లుక్ ని బయటికి వదిలినట్టుగా అనిపిస్తుంది. మరి విజయ్ - పూరి కాంబో టైటిల్ త్వరలోనే అంటూ మూవీ టీం ఎప్పటికప్పుడు ఊరిస్తున్నారు. ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి.