Advertisementt

దేన్ని ఎలా డీల్ చేయాలో నేర్చుకుందట!

Tue 23rd Jun 2020 05:12 PM
heroine,ritu varma,lock down life,movies,nani movie,telugu heroine  దేన్ని ఎలా డీల్ చేయాలో నేర్చుకుందట!
Heroine Ritu Varma about Lock down Life దేన్ని ఎలా డీల్ చేయాలో నేర్చుకుందట!
Advertisement
Ads by CJ

తెలుగు హీరోయిన్ అయినా... తెలుగులో అవకాశాలు లేక మలయాళం, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ.. ఒక గుర్తింపు వచ్చాక మళ్లీ తెలుగులో బిజీ అయిన తెలుగందం రీతూ వర్మ.. ఇప్పుడు ఏకంగా తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది. నాని, శర్వానంద్, నాగ శౌర్యలతో కలిసి నటిస్తుంది. పెళ్లి చూపులు సినిమాలో స్వీట్ క్యూట్ గా ఆకట్టుకున్న రీతూ వర్మ.. తర్వాత తెలుగులో బిజీ అవుతుంది అనుకుంటే.. ఇక్కడ సరైన కథలు దొరక్క పొరుగు భాషలకు పోయింది. తాజాగా స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి కనులు కనులను దోచాయంటే అంటూ.. ఓ భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత నాని టక్ జగదీశ్, శర్వానంద్ డ్యూయెల్ రోల్ చెయ్యబోయే సినిమాలోనూ, నాగ శౌర్య సినిమాలోనూ హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకున్న రీతూ వర్మ కరోనా లాక్ డౌన్ ముందులో బాగానే అనిపించినా.. ఇప్పుడు మాత్రం షూటింగ్స్ ని మిస్ అవుతున్నా అంటుంది.

నానితో టక్ జగదీశ్ చిత్రీకరణ సమయంలో కరోనా తో లాక్ డౌన్ వచ్చి షూటింగ్ కి బ్రేకులు పడ్డాయని చెబుతున్న రీతూ వర్మ.. షూటింగ్స్ కి అనుమతులు లభించినా.. తాను నటిస్తున్న నాలుగు సినిమాల నిర్మాణ సంస్థల నుండి షూటింగ్ లో పాల్గొనాలని కబురు రాలేదంటుంది. కరోనా తో టైం తీసుకుని షూటింగ్స్ ప్రారంభిస్తేనే బెటర్ అంటుంది రీతూ వర్మ. ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఏమి తెలిసేది కాదని, చిత్ర రంగానికి.. కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు కనక.. ఒంటరిగానే సినిమాల్లోకి వచ్చి సినిమా సినిమాకి ఎంతో నేర్చుకున్నా అని.. వచ్చిన కొత్తల్లో చాలా సున్నితంగా ఉండేదాన్ని అని.. ప్రతి విషయం హృదయం దాక వెళ్ళేది అని.. కానీ ఇప్పుడు ఏ విషయాన్ని ఎలా డీల్ చెయ్యాలో బాగా నేర్చుకున్నా అని చెబుతుంది. సినిమా పరిశ్రమ అనగానే దాన్ని ప్రత్యేకమైన కోణంలో చూస్తారు. కానీ ఎక్కువమంది ప్రొఫెషనల్ గానే ఉంటారు. నాకెప్పుడూ ఇక్కడ చేదు అనుభవాలు ఎదురు కాలేదు అని చెబుతుంది రీతూ వర్మ.

Heroine Ritu Varma about Lock down Life:

Heroine Ritu Varma talks about Her Movies and Lock down Life

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ