తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రీతూ వర్మ.. ఆ తర్వాత తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే కనిపించింది. నిఖిల్ సరసన కేశవ సినిమాలో చేసినప్పటికీ అంతగా పేరు తీసుకురాలేదు. అయితే తెలుగులో అవకాశాలు తక్కువగా వస్తున్నా, తమిళంలో మాత్రం దూసుకుపోతుంది. తెలుగులో హిట్ అందుకుని తమిళంలో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ బిజీగా ఉంటోంది.
అయితే అందుకు కారణం తెలుగులో ఆమెకి అవకాశాలు రాకపోవడం కాదట. పెళ్ళి చూపులు తర్వాత హీరోయిన్ గా అవకాశాలు బాగానే వచ్చాయట. కానీ ఆమెకి సరిపోయే పాత్రలు రాకపోవడం వల్లే ఒప్పుకోలేనని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయని అంటుంది. శర్వానంద్ తో చేస్తున్న ద్విభాషా చిత్రంతో పాటు నాని సరసన టక్ జగదీష్ లోనూ నటిస్తున్నానని చెబుతుంది.
మొత్తానికి తెలుగులో హిట్ అందుకుని తమిళంలో హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రీతూ వర్మ, తెలుగు సినిమాల్లో కూడా బిజీ కానుందని అర్థం అవుతుంది. మరి తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.