Advertisementt

RRR: ఆలియాభట్ స్థానంలో మరో హీరోయిన్ రాబోతుందా..?

Mon 22nd Jun 2020 02:54 PM
aliya bhat,rajamouli,rrr,ram charan,ntr  RRR: ఆలియాభట్ స్థానంలో మరో హీరోయిన్ రాబోతుందా..?
RRR: Rajamouli searching for Aliya replace..? RRR: ఆలియాభట్ స్థానంలో మరో హీరోయిన్ రాబోతుందా..?
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ కారణంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కి పెద్ద ఇబ్బంది ఎదురైంది. సుమారు మూడు నెలలుగా షూటింగ్ లేకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ అనుకున్న తేదీకి విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ స్థానంలో వేరే హీరోయిన్ ని తీసుకునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఆలియా ఇప్పటికే రెండు సార్లు డేట్లు ఇచ్చిందట. కానీ కరోనా వల్ల ఆమె పార్ట్ చిత్రీకరణ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చిత్రీకరణకి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆలియా భట్ షూటింగ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదట. బాలీవుడ్  సినిమాలతో బిజీగా ఉండడం వల్ల మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ కోసం ప్రత్యేకంగా డేట్లు ఇవ్వలేనని చెబుతోందని అంటున్నారు.

దీంతో రాజమౌళి ఆలియా భట్ స్థానంలో మరొకరిని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారట. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం. ప్రస్తుతానికి టెస్ట్ షూట్ కి సిద్ధం అవుతున్న రాజమౌళి మరికొద్ది రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ స్టార్ట్ చేసేలా కనబడుతున్నాడు.

RRR: Rajamouli searching for Aliya replace..?:

RRR: Rajamouli searching for Aliya replace..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ