Advertisementt

డిజిటల్ ప్రపంచంలోకి గోపీచంద్ ఎంట్రీ..?

Mon 22nd Jun 2020 03:24 PM
gopi chand,nara rohit,raja cheyyi vesthe,pradeep chilukuri,web series,telugu  డిజిటల్ ప్రపంచంలోకి గోపీచంద్ ఎంట్రీ..?
Gopi chand will do a web series with..? డిజిటల్ ప్రపంచంలోకి గోపీచంద్ ఎంట్రీ..?
Advertisement
Ads by CJ

ప్రస్తుత పరిస్థితుల్లో వినోదం కోసం ఓటీటీలే దిక్కుగా మారాయి. లాక్డౌన్ కారణంగా జనాలు ఓటీటీలకి బాగా అలవాటు పడ్డారు. దాంతో ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే గతంలో సినిమా హీరోలు ఓటీటీ కోసం వెబ్ సిరీస్ చేయడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో, తెరుచుకున్నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని కారణంగా భవిష్యత్తులో ఓటీటీలకి విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న కారణంగా హీరోలు సైతం స్ట్రీమింగ్ సైట్స్ కోసం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు.

తాజాగా హీరో గోపీచంద్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. నారా రోహిత్ హీరోగా నటించిన రాజా చెయ్యి వేస్తే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నాడని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో తెరకెక్కనుందట. వరుస సినిమాలతో వైఫల్యాలు ఎదుర్కొంటున్న గోపీచంద్, వెబ్ సిరీస్ ద్వారా నైనా హిట్ సాధిస్తాడేమో చూడాలి.

Gopi chand will do a web series with..?:

Gopi chand will do a web series with..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ