విజయ్ దేవరకొండ హీరోగా చేసిన టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ సాంక్రిత్యయాన్ తన రెండవ సినిమాకి నేచరల్ స్టార్ నాని ని హీరోగా ఒప్పించాడు. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్యామ్ సింగరాయ్ అనే విభిన్నమైన టైటిల్ ని పెట్టారు. కరోనా కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలని ఖండించిన చిత్ర దర్శకుడు ఆల్రెడీ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించాడు.
అందులో భాగంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లని ఎంపిక చేసే పనిలో ఉన్నారట. అయితే మొదటి హీరోయిన్ గా సాయిపల్లవి ఓకే అయిపోయింది. శ్యామ్ సింగరాయ్ లో సాయిపల్లవి పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుందట. సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందన్న ని అనుకున్నారట. ఈ మేరకు ఆమెని సంప్రదించినట్లు సమాచారం. అయితే రష్మిక, శ్యామ్ సింగరాయ్ లో నాని సరసన నటించడానికి నిరాకరించిందని అంటున్నారు.
తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మికని సెకండ్ హీరోయిన్ గా అడగడం వల్లే ఆమె ఒప్పుకోలేదని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి బ్లాక్ బస్టర్లతో ఫామ్ లో ఉన్న రష్మిక సెకండ్ హీరోయిన్ గా చేయనని చెప్పేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో హీరోయిన్ గా నటిస్తుంది.