Advertisementt

బిగ్ బాస్ లోకి ఆ నలుగురు హీరోయిన్లు..?

Sat 27th Jun 2020 07:17 AM
bigg boss 4,yamini bhaskar,shraddha das,priya vadlamani,hamsa nandini,nagarjuna  బిగ్ బాస్ లోకి ఆ నలుగురు హీరోయిన్లు..?
Those four heroins for Bigg Boss season 4..? బిగ్ బాస్ లోకి ఆ నలుగురు హీరోయిన్లు..?
Advertisement
Ads by CJ

తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకి అనుమతులు లభించిన నేపథ్యంలో టెలివిజన్లో ఆల్రెడీ సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే తెలుగు టెలివిజన్ లో అత్యంత పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బిగ్ బాస్ పై పడింది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లుగా ఎవరు రానున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

మొన్నటికి మొన్న బిత్తిరిసత్తి బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నలుగురు హీరోయిన్లు బిగ్ బాస్ లో కనిపించనున్నారని అంటున్నారు. స్టార్ మా లో టెలిక్యాస్ట్ అవనున్న ఈ షోలో యామినీ భాస్కర్, ప్రియా వడ్లమాని, హంసా నందినీతో పాటు శ్రద్ధా దాస్ రానున్నారట. ఇప్పటికే వీరితో బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు జరిపిందని టాక్.

ఈ నలుగురిలో హంసా నందినీ, శ్రద్ధా దాస్ అందరికీ సుపరిచితమే. ఇక మిగిలిన ఇద్దరిలో యామినీ భాస్కర్, నాగశౌర్య సరసన నర్తనశాల సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.  ప్రియా వడ్లమాని హుషారు సినిమాలో ఉండిపోరాదే పాటలో కనిపిస్తుంది.

Those four heroins for Bigg Boss season 4..?:

Those four heroins for Bigg Boss season 4..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ