Advertisementt

ఆకట్టుకుంటున్న విశాల్ ‘చ‌క్ర’ ట్రైల‌ర్‌!

Sun 28th Jun 2020 10:43 AM
chakra,chakra trailer,hero vishal,good response,4 languages  ఆకట్టుకుంటున్న విశాల్ ‘చ‌క్ర’ ట్రైల‌ర్‌!
Good Response to Hero Vishal’s ‘Chakra’ Trailer ఆకట్టుకుంటున్న విశాల్ ‘చ‌క్ర’ ట్రైల‌ర్‌!
Advertisement
Ads by CJ

నాలుగు సౌతిండియ‌న్ లాంగ్వేజెస్‌లో ఒకేసారి విడుద‌లైన యాక్ష‌న్ హీరో విశాల్ ‘చ‌క్ర’ ట్రైల‌ర్‌.

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘చ‌క్ర‌’ ట్రైల‌ర్ విడుద‌లైంది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను వెర్స‌టైల్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి, త‌మిళ ట్రైల‌ర్‌ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య,‌ మల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్, క‌న్న‌డలో రాకింగ్ స్టార్ యశ్ జూన్ 27 సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.

బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంద‌ని ట్రైల‌ర్‌లో తెలుస్తోంది. ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్‌డే హైద‌రాబాద్‌ సిటీ మొత్తం హై అల‌ర్ట్‌లో ఉంటుంది కాని ఆరోజు..అని విశాల్ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన 2నిమిషాల 07 సెకండ్ల నిడివిగ‌ల‌ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. మిల‌ట‌రీ ఆఫిస‌ర్‌గా విశాల్ ప‌వ‌ర్‌ఫుల్‌ ఎంట్రీ స్టైలీష్‌గా ఉంది. ఒక దేశాన్ని బెదిరించే తీవ్ర‌వాదుల యాక్టివిటీస్‌ని గ‌మ‌నించ‌డానికి ఒక నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీస‌ర్చ్ కంటే, ఓ స‌గ‌టు మ‌నిషి అవ‌స‌రాలు, వాడి ఆశ‌లు తెలుసుకోవ‌డం కోసం ఓ కార్పోరేట్ కంపెనీ చేసే రీస‌ర్చే ఎక్కువ అంటారు, క‌చ్చితంగా మ‌నం వెతికే క్రిమిన‌ల్ మ‌న కంటికి క‌నిపించ‌డు, ఇప్పుడే క‌దా వేడెక్కింది ది గేమ్ బిగిన్స్, కంటికి క‌నిపించ‌ని వైర‌స్ మాత్ర‌మే కాదు వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే.. వెల్‌క‌మ్ టు డిజిట‌ల్ ఇండియా వంటి డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. యువ‌న్ శంక‌ర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన విశాల్ ప‌వ‌ర్‌ఫుల్‌ లుక్‌తో కూడిన ‘చ‌క్ర’‌‌ పోస్ట‌ర్, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. హీరోయిన్‌గా పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లో శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

Click Here for Trailer

Good Response to Hero Vishal’s ‘Chakra’ Trailer:

Trailer Of Action Hero Vishal’s ‘Chakra’ Trailer Released Simultaneously In Four South Indian Languages

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ