‘వకీల్‌సాబ్’తో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కరోనా లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వకీల్‌సాబ్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునేవారు. లాక్‌డౌన్ అడ్డుపడి.. ఓ 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉండిపోయింది కానీ.. లేదంటే థియేటర్స్ మొత్తం షేక్ చేసేవారు పవన్ ఫ్యాన్స్. కేవలం పవన్ వకీల్‌సాబ్ ఫస్ట్ లుక్ తోనే పవన్ ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ఓ సాంగ్ మార్కెట్ లో ఇప్పటికీ క్రేజీగా వినబడుతుంది. అయితే వకీల్‌సాబ్ ఎప్పుడెప్పుడు బయటికొస్తుందా? ఎప్పుడెప్పుడు వకీల్‌సాబ్ అప్ డేట్ ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక సినిమా లాక్‌డౌన్ మూలంగా దసరాకి విడుదల చేయబోతున్నారని.. కాదు.. ఈ కరోనా అంతా ముగిశాక డిసెంబర్‌లో షూటింగ్ మొదలుపెట్టి పోస్ట్ ప్రొడక్షన్ మొదలెట్టి.. దిల్ రాజుకి అచ్చొచ్చిన సంక్రాంతికే సినిమా రిలీజ్ అంటూ చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వకీల్‌సాబ్‌పై ఎలాంటి క్లారిటీ లేని టైమ్‌లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ కోర్టులో వాదించే లుక్ లీక్ అవడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. వకీల్‌సాబ్‌లో కీలకమైన సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ కోర్టులో లాయర్‌గా వాదనలు వినిపిస్తూ ఎమోషనల్‌గా కనబడుతున్న లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ లీకెడ్ పిక్‌లో పవన్ లాయర్ కోటులో వాదనలు వినిపిస్తుంటే.. పక్కనే హీరోయిన్ అంజలి కనబడుతుంది. మరి పవన్ కళ్యాణ్ లాయర్‌గా ఎంత పవర్ ఫుల్ గా కోర్టులో వాదిస్తాడో కానీ... ప్రస్తుతం పవన్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.