బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెరపై విజయవంతంగా దుసుకుపోతున్న ఈ రియాలిటీ షో నాలువగ సీజన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుంది. అందువల్ల ఈ సీజలో పాల్గొనే కంటెస్టెంట్స్ విషయమై రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. మూడవ సీజన్ కి వ్యాఖ్యతగా వ్యవహరించిన నాగార్జున, నాలుగవ సీజన్ కి కూడా కంటిన్యూ అవుతున్నాడు. ఈ సీజన్ పట్ల నాగార్జున చాలా ఆసక్తిగా ఉన్నాడట.
అయితే మొన్నటికి మొన్న బిత్తిరి సత్తి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వస్తున్నాడన్న వార్త బయటకి వచ్చింది. తాను ప్రస్తుతం పనిచేస్తున్న టీవీ ఛానెల్ కి రాజీనామా చేసాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో బిగ్ బాస్ లోకి రాబోతున్నాడని అన్నారు. ఆ తర్వాత నలుగు హీరోయిన్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారని ప్రచారం చేసారు. హంసా నందినీ, శ్రధ్దా దాస్, ప్రియా వడ్లమాని, యామిని భాస్కర్ ల పేర్లు ఈ లిస్టులో కనబడ్డాయి.
తాజాగా టాలీవుడ్ కి చెందిన నలుగురు సెలెబ్రిటీల పేరు మార్మోగుతోంది. సింగర్ సునీతతో పాటు యాక్టర్ నందు, యాంకర్ కమ్ నటి ఝాన్సీ ఇంకా కమెడియన్ తాగుబోతు రమేష్.. ఈ నలుగురిని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించిందని అంటున్నారు. మరి వీరందరిలో ఎంత మంది బిగ్ బాస్ నాలుగవ సీజన్లోకి అడుగుపెడతారో చూడాలి.