Advertisementt

‘లూసిఫర్’ రీమేక్‌లో ఆ ఇద్దరు..!

Wed 01st Jul 2020 10:08 AM
chiranjeevi,lucifer remake,kushboo,jagapathi babu,manju,vivek oberoi  ‘లూసిఫర్’ రీమేక్‌లో ఆ ఇద్దరు..!
Kushboo and Jagapathi Babu in Lucifer remake ‘లూసిఫర్’ రీమేక్‌లో ఆ ఇద్దరు..!
Advertisement
Ads by CJ

చిరంజీవి - సాహో దర్శకుడు సుజిత్ కాంబోలో తెరకెక్కబోతున్న మలయాళ లూసిఫర్ రీమేక్.. స్క్రిప్ట్ పనులు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్టుగా ఫిలింనగర్ టాక్. కరోనా లాక్ డౌన్ సుజిత్ కి బాగా కలిసి రావడంతో లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్చాడట. చిరు సలహాలతో సుజిత్ పక్కాగా లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో చిరు, మోహన్ లాల్ కేరెక్టర్ చేస్తుంటే.. మరో హీరోగా రానా పేరు వినబడుతుంది. అయితే ఇంకా నటీనటుల పేర్లు బయటికి రాలేదు కానీ.. కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అందులో లూసిఫర్‌లో మోహన్ లాల్ కి చెల్లెలిగా నటించిన మంజు పాత్రలో నటించేందుకు విజయశాంతిని సంప్రదించారని, కానీ విజయ్ శాంతి చిరుకి చెల్లెలిగా నటించనని చెప్పడంతో.. అలనాటి తార సుహాసిని పేరు వినబడుతుంది. మంజు వారియర్ పాత్రకి సుహాసిని పక్కా అన్నారు.. కానీ తాజాగా మంజు వారియర్ పాత్రకి తమిళ నటి ఖుష్బూ పేరు వినబడుతుంది. అంతేకాదు.. మంజు వారియర్ భర్త పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ పాత్రకి ప్రస్తుతం విలన్ గా అదరగొడుతున్న జగపతి బాబు నటిస్తాడని టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. విమల నాయుడు ఉరఫ్ బాబీ పాత్రకి జగపతి బాబు అయితే తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాడని అందుకే... జగపతి బాబుని చిత్ర బృందం ఫోన్ లోనే సంప్రదించినట్టుగా.. జగపతి బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు..

Kushboo and Jagapathi Babu in Lucifer remake:

One more gossip on Chiru lucifer remake 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ