Advertisementt

వెన్నెల పాత్రలో శివానీ రాజ‌శేఖ‌ర్ పరిచయం!

Wed 01st Jul 2020 02:02 PM
shivani rajashekar,vennela,first film,birthday special,teja sajja,mallik ram  వెన్నెల పాత్రలో శివానీ రాజ‌శేఖ‌ర్ పరిచయం!
Shivani Rajashekar as Vennela in Her First Film వెన్నెల పాత్రలో శివానీ రాజ‌శేఖ‌ర్ పరిచయం!
Advertisement
Ads by CJ

శివానీ రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా వెన్నెల క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

రానున్న ఒక ఫాంట‌సీ ల‌వ్‌స్టోరీలో వెన్నెల అనే క్యూట్ రోల్‌లో శివానీ రాజ‌శేఖ‌ర్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రంలో తేజ స‌జ్జా హీరోగా న‌టిస్తున్నారు. జూలై 1 శివానీ బ‌ర్త్‌డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని సినిమాలో ఆమె పోషిస్తోన్న క్యారెక్ట‌ర్ ప‌రిచ‌య పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

టాలీవుడ్ ప్ర‌ముఖ న‌టులు రాజ‌శేఖ‌ర్‌, జీవితా రాజ‌శేఖ‌ర్ కుమార్తె అయిన శివానీ ఆ పోస్ట‌ర్‌లో ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చుడీదార్ ధ‌రించి, గోడ మీద కూర్చొని ఆకాశంలోని నెల‌వంక‌ను చూపిస్తోన్న ఆమె అపురూప లావ‌ణ్యంతో మెరిసిపోతున్నారు. ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని సెల్‌ఫోన్‌లో ఏవో వింటూ స‌రిగ్గా పాత్ర పేరు వెన్నెల‌కు త‌గ్గ‌ట్లుగా ఆమె క‌నిపిస్తున్నారు.

బాల‌న‌టుడిగా ప‌లు చిత్రాల్లో న‌టించి, సూప‌ర్ హిట్ సినిమా ‘ఓ బేబీ’లో యంగ్ యాక్ట‌ర్‌గా ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా ఈ న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మూడు సీజ‌న్లు ర‌న్ అయిన ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్న మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌కుడిగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నారు.

యు.ఎస్‌.కు చెందిన‌ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ఎస్ ఒరిజిన‌ల్స్, మ‌హాతేజ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం సెట్స్ మీదున్న ఈ మూవీ తారాగ‌ణం, ఇత‌ర వివ‌రాల‌ను ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

హీరో: తేజ స‌జ్జా

హీరోయిన్‌: శివానీ రాజ‌శేఖ‌ర్‌

డైరెక్ట‌ర్‌: మ‌ల్లిక్ రామ్‌

Shivani Rajashekar as Vennela in Her First Film:

Introducing Shivani Rajashekar as Vennela in an unnamed upcoming Fantasy Love Story also starring Teja Sajja